ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైలవరం సీటు ఆశిస్తున్నా: బొమ్మసాని సుబ్బారావు

ABN, First Publish Date - 2023-04-03T01:13:46+05:30

తాను మైలవరం సీటును ఆశిస్తున్నానని ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పి అభ్యర్థిస్తానని టీడీపీ ఉపాఽధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు అన్నారు.

మాట్లాడుతున్న బొమ్మసాని సుబ్బారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గొల్లపూడి, ఏప్రిల్‌ 2: తాను మైలవరం సీటును ఆశిస్తున్నానని ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పి అభ్యర్థిస్తానని టీడీపీ ఉపాధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు అన్నారు. ఆదివారం గొల్లపూడిలో తన నివాసంలో నియోజకవర్గంలో 14 పోలింగ్‌ బూత్‌ల యువత, క్రియాశీలకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా డారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ ఎవరిని అభ్యర్థిగా పెడితే వారికి పని చేయాలని సూచించారు. టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తానని, జిల్లాలోకి నారా లోకేష్‌ యువగళం వచ్చే సమయానికి 4 వేల మంది యువతను సిద్ధం చేస్తానని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, యువత, బూత్‌ లెవల్‌ క్రియాశీలకులు, తమ పరిసర ప్రాంతాల వారికి టీడీపీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను తెలపాలన్నారు. షాబాద, జక్కంపూడి ప్రాంతాల్లో టీడీపీ హయాంలో నిర్మించిన 12 వేల ఇళ్లు పాడైపోతున్నాయన్నారు. లబ్ధిదారులకు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చేస్తుందన్నారు. షేక్‌ ఖాదర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T01:13:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising