ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుర్రపుడెక్క తొలగింపు పనుల పరిశీలన

ABN, First Publish Date - 2023-06-11T01:23:57+05:30

డెల్టా ఆయకట్టు పరిధిలోని ఏలూరు కాలువ కింద చిట్టచివరి భూములకు పుష్కలంగా సాగునీరు అందించటమే లక్ష్యంగా ఉపాధిహామీ పథకం కింద ఉపకాలువల్లో పూడికతీత పనులు చేపట్టినట్లు ఎంపీడీవో జీఎస్‌వీ శేషగిరిరావు అన్నారు.

గుర్రపుడెక్కను తొలగిస్తున్న ఉపాధి కూలీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉంగుటూరు, జూన్‌ 10 : డెల్టా ఆయకట్టు పరిధిలోని ఏలూరు కాలువ కింద చిట్టచివరి భూములకు పుష్కలంగా సాగునీరు అందించటమే లక్ష్యంగా ఉపాధిహామీ పథకం కింద ఉపకాలువల్లో పూడికతీత పనులు చేపట్టినట్లు ఎంపీడీవో జీఎస్‌వీ శేషగిరిరావు అన్నారు. పెదఅవుటపల్లిలోని వరాహకోడు-తుట్టగుంట ఉపచానల్‌లో ఉపాధిహామీ పథకం కింద జరుగుతున్న పూడికతీత, గుర్రపుడెక్క తొలగింపు పనులను శనివారం ఆయన పరిశీలించారు. తొలుత మస్తర్లను తనిఖీ చేశారు.

ఉపకాలువల్లో దట్టంగా అలముకున్న గుర్రపుడెక్క, తూటుకాడవల్ల సాగునీటి సరఫరాకు తీవ్ర అడ్డంకి ఏర్పడుతుందని, ఉపాధిహామీ కింద పనులు చేపట్టడం ద్వారా చివరి భూముల వరకు సమృద్ధిగా సాగునీరు అందుతుందన్నారు. ఖరీఫ్‌ సీజను ప్రారంభం కానున్న దృష్ట్యా పొలాల్లో కెళ్లే పంటబోదెలను అభివృద్ధి పరచుకు నేలా రైతులను చైతన్యపరచాలని సూచించారు. పీల్డ్‌ అసిస్టెంట్‌ వెంకటరమణ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-11T01:23:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising