ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండేళ్లగా అందని ధాన్యం సొమ్ము..!

ABN, First Publish Date - 2023-01-25T00:53:59+05:30

ఆరుకాలం కష్టించి పండించిన పంటను కొనుగోలు చేసిన ప్రభుత్వం రెండేళ్లగా డబ్బులు చెల్లించకపోవడంతో ఆగ్రహించిన రైతులు ప్రజా సంఘాల అధ్వర్యంలో మంగళవారం స్థానిక తహసీల్ధార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఎ.కొండూరు తహసీల్ధార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న రైతులు, వామపక్ష నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎ.కొండూరు, జనవరి 24 : ఆరుకాలం కష్టించి పండించిన పంటను కొనుగోలు చేసిన ప్రభుత్వం రెండేళ్లగా డబ్బులు చెల్లించకపోవడంతో ఆగ్రహించిన రైతులు ప్రజా సంఘాల అధ్వర్యంలో మంగళవారం స్థానిక తహసీల్ధార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 2021 ఖరీఫ్‌ సీజన్‌లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రం డీసీఎంఏస్‌ ద్వారా ఎ.కొండూరు, కుమ్మరికుంట్ల, ఎ.కొండూరు తండాకు చెందిన 24మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసింది. 1379 క్వింటాల ధాన్యానికి అప్పట్లో రూ. 26 లక్షలకుగాను రూ. 15 లక్షలు చెల్లించారని, మిగిలిన మొత్తం గత రెండున్నర సంవత్సరాలుగా ఇవ్వకుండా కాలయాపన చేయడంతో అధికారులు, జిల్లా కలెక్టర్‌కు, స్పందనలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరుస నష్టాలు, చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక మనోవేదనకు గురవుతున్నామన్నారు. మంగళవారం రైతులు సీపీఎం నేతల ఆధ్వర్యంలో ఎ.కొండూరు తహసీల్ధార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తహసీల్ధార్‌ సీహెచ్‌ వెంకటేశ్వర్లు, ఎస్సై అంకారావులు రైతులతో మాట్లాడి సమస్యలను ఉన్నతధికారుల తీసుకెళ్లి పరిష్కారిస్తామని హమీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఆందోళనలో సీపీఎం నేతలు ఆనందరావు, వెంకటేశ్వరావు, రాముడు, గోపిరాజు, రామకృష్ణారెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:54:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising