రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి: శ్రీరాం తాతయ్య
ABN, First Publish Date - 2023-10-17T00:45:00+05:30
సాగునీరందక మిర్చి పంట ఎండిపోయిందని, రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) డిమాండ్ చేశారు.
పెనుగంచిప్రోలు: సాగునీరందక మిర్చి పంట ఎండిపోయిందని, రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) డిమాండ్ చేశారు. పెనుగంచిప్రోలులో ఎండిపోతున్న మిర్చి పంటలను సోమ వారం ఆయన పరిశీలించారు. టీడీపీ హయాంలో నియోజకవర్గంలోని స్కీమ్‌లు పని చేసేవని, వాటి ద్వారా నీటిని సాగర్ కాలువలకు విడుదల చేసి రైతులను ఆదు కున్నామని తెలిపారు. ఇప్పుడు స్కీమ్‌లు పని చేయక సాగర్ కాలువలకు సాగు నీరు అందడం లేదన్నారు. రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. టీడీపీ మండల అఽధ్యక్షుడు చింతల వెంకటసీతారామయ్య, గజ్జి కృష్ణమూర్తి, నల్లపు నేని కొండ, నూతలపాటి కృష్ణ పాల్గొన్నారు.
Updated Date - 2023-10-17T00:45:00+05:30 IST