ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు రూ.4.80కోట్లు ఇవ్వండి
ABN, First Publish Date - 2023-08-02T00:40:50+05:30
అవనిగడ్డ నియోజకవర్గం, నాగాయలంక మండల పరిధిలోని గుల్లలమోదలో మోడల్ ఫిష్‌ల్యాండింగ్ సెంటరుకు రూ.4.80కోట్లు మంజూరు చేయాలని కోరుతూ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కేంద్ర పవర్‌ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ ఫర్మిందర్ చోప్రా, డైరెక్టర్ మనోజ్‌శర్మలను కోరారు.
మచిలీపట్నం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : అవనిగడ్డ నియోజకవర్గం, నాగాయలంక మండల పరిధిలోని గుల్లలమోదలో మోడల్ ఫిష్‌ల్యాండింగ్ సెంటరుకు రూ.4.80కోట్లు మంజూరు చేయాలని కోరుతూ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కేంద్ర పవర్‌ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ ఫర్మిందర్ చోప్రా, డైరెక్టర్ మనోజ్‌శర్మలను కోరారు. ఢిల్లీలో పవర్‌ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ, డైర్టెక్టర్‌ను ఆయన సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని గుల్లలమోద గ్రామంలో ఇంటిగ్రేటెడ్ విలేజ్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టులో భాగంగా ఫిష్‌ల్యాండింగ్ సెంటరును నిర్మిస్తే వలలు భద్రం చేసుకునేందుకు హాలు, చేపల వేలంపాట హాలు, మూడు ఫిష్ డ్రై ప్లాట్ ఫాంలు, సోలార్‌లైట్లు, గూడౌన్‌లు, డీప్‌సీ వెజల్, పిష్‌ట్రాన్స్‌పోర్టు వాహనం, తాగునీటి సౌకర్యం, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం అభివృద్ధి పనులు చేయాల్సి ఉందన్నారు. వాటితోపాటు గ్రామంలో పొలాలు ముంపుబారిన పడితే నీటిని బయటకు తోడేందుకు మోటార్లు, షెడ్డు తదితరాలను ఏర్పాటు చేసేందుకు మొత్తంగా రూ.4.80 కోట్లను మంజూరు చేయాలని ఎంపీ కోరారు. పోర్టు అభివృద్ధితో జిల్లా ఎంతగానో అభివృద్ధి చెందుతుందని, రుణం మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. సమీకృత మత్స్యఅభివృద్ధి ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసేందుకు అనుమతులు త్వరలో ఇస్తామని హామీ ఇచ్చినట్టు ఎంపీ తెలిపారు.
Updated Date - 2023-08-02T00:40:50+05:30 IST