ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా ప్రపంచ టైలర్స్‌ డే

ABN, First Publish Date - 2023-03-01T01:30:12+05:30

ప్రపంచ టైలర్స్‌డే వేడుకలను మంగళవారం టైలర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో కుట్టుమిషన్‌ రూపకర్త విలియమ్స్‌ హౌవే చిత్రపటానికి టైలర్స్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గన్నవరం, ఫిబ్రవరి 28 : ప్రపంచ టైలర్స్‌డే వేడుకలను మంగళవారం టైలర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో కుట్టుమిషన్‌ రూపకర్త విలియమ్స్‌ హౌవే చిత్రపటానికి టైలర్స్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాలకులు టైలర్స్‌ను ఆదుకోవా లన్నారు. మల్లికార్జున, శ్రీనివాసరావు, సుబ్బారావు, రాజా, నాని, ఏసు, డేవిడ్‌, కృష్ణ, బాలయ్య, మాలాద్రి, ఈశ్వరరావు, వెంకట్రావు, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

హనుమాన్‌జంక్షన్‌ : స్వయం ఉపాధి మీద జీవనం సాగించే టైలర్స్‌ ఏకతాటిపై పోరాటాలు సాగించినపుడే ప్రభుత్వం పరంగా సంక్షేమ పథకా లను అందుకునే అవకాశం ఉందని స్థానిక హనుమాన్‌ టైలర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు అక్బర్‌ బాబా, అధ్యక్షుడు రెడ్డి నరసింహారావు అన్నారు. మంగళవారం అంతర్జాతీయ టైలర్స్‌ డే సందర్భంగా హనుమాన్‌ జంక్షన్‌లో టైలర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు.

కంకిపాడు : చేతి వృత్తిదారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కంకిపాడు జిల్లా పరిషత్‌ సభ్యులు బాకి బాబు అన్నారు. టైలర్స్‌ అసోసి యేషన్‌ సర్వసభ్య సమావేశం కంకిపాడులోని కన్యకాపరమేశ్వరి కల్యాణ మండపంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజ రైన బాకి బాబు మాట్లాడుతూ టైలర్స్‌ అసోసియేషన్‌ భవనం నిర్మాణా నికి అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు పంచాయతీ సిద్ధగా ఉందన్నారు.

విజయవాడ రూరల్‌ : వైసీపీ ప్రభుత్వ పాలనలో దర్జీలు దర్జాగా బతకలేకపోతున్నారని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దండు సుబ్రహ్మణ్యం రాజు అన్నారు. జాతీయ టైలర్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని నున్న గ్రామంలోని సీనియర్‌ టైలర్‌ బాడిస మోహనరావును మంగళవారం గ్రామ టీడీపీ నేతలు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

Updated Date - 2023-03-01T01:30:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!