ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్వ జనుల సంక్షేమానికి.. శతచండీ మహా రుద్రయాగం

ABN, First Publish Date - 2023-03-02T00:44:09+05:30

ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం శతచండీసహిత మహా రుద్రయాగాన్ని ప్రారంభించనున్నారు. సర్వజనుల సంక్షేమానికి ఐదురోజుల పాటు వేద పండితులు, అలయ అర్చకులు నమక చమక పారాయణాలు, హోమాలు, పూజాదికాలను నిర్వహించనున్నారు.

ఇంద్రకీలాద్రిపై యాగానికి సిద్ధం చేసిన హోమ గుండాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వన్‌టౌన్‌, మార్చి 1 : ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం శతచండీసహిత మహా రుద్రయాగాన్ని ప్రారంభించనున్నారు. సర్వజనుల సంక్షేమానికి ఐదురోజుల పాటు వేద పండితులు, అలయ అర్చకులు నమక చమక పారాయణాలు, హోమాలు, పూజాదికాలను నిర్వహించనున్నారు. ఇందుకోసం ఘాట్‌రోడ్డులో చిన్న రాజగోపురానికి సమీపంలో లక్ష్మీగణపతి విగ్రహం ఎదురు యాగశాలను ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను ఈవో, పాలకమండలి చైర్మన్‌, సభ్యులు పరిశీలించారు. ఈఈ కోటేశ్వరరావు, ఇంజనీరింగ్‌ అధికారులు, సిబ్బంది, అర్చకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తొలిరోజు ఉదయం 10 గంటలకు విఘ్నేశ్వరపూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.

తిలకించి తరించండి : ఈవో భ్రమరాంబ

దుర్గగుడిలో గురువారం నుంచి జరగనున్న శతచండీయాగాన్ని భక్తులు తిలకించి తరించాలని దేవస్థానం ఈవో భ్రమరాంబ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. దేవదాయ కమిషనర్‌ ఉత్తర్వుల మేరకు దేవస్థానం వైదిక కమిటీ సూచనల ప్రకారం శతచండీసహిత రుద్రయాగాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ యాగం వలన ప్రజలందరికీ మంచి జరుగుతుందన్నారు. ఈనెల 2వ తేదీ నుంచి ఆరో తేదీ వరకు జరిగే కార్యక్రమాలను భక్తులు తిలకించి తరించాలన్నారు. పౌర్ణమి నాడు సాయంత్రం 5 గంటల నుంచి గిరిప్రదక్షిణలోనూ భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ, లోక కల్యాణం కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. స్థానాచార్యుడు శివ ప్రసాదశర్మ మాట్లాడుతూ, ‘కలౌచండీ నాయకౌ’.. అంటే కలియుగంలో చండీమాతను కొలవాలని పురాణ గ్రంథాలలో ఉంది. అమ్మవారే మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి స్వరూపం.. అమ్మవారిని నిత్యం సేవిస్తే బాధలు, రుగ్మతలు తొలిగిపోతాయని శాస్త్రంలో ఉందన్నారు. ఇదే సమయంలో శివుడు అభిషేక ప్రియుడు.. నమక మంత్రాలను హోమ రూపంలో శివుడికి అర్పిస్తే విశేష ఫలితం ఉంటుందన్నారు.

Updated Date - 2023-03-02T00:44:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!