ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూచిపూడి నాట్యంలో అడుగులే కీలకం

ABN, First Publish Date - 2023-04-24T01:21:46+05:30

కూచిపూడిలో ఉన్నతులుగా ఎదగటానికి నాట్యానికి పునాది అయిన అడుగులు ఎంతో దోహద పడతాయని ప్రముఖ కూచిపూడి నాట్యాచారిణి, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత మంజుభార్గవి పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, కూచిపూడి సిద్దేంధ్ర కళాపీఠంలో సేవ్‌ కూచిపూడి ఆర్టిస్ట్‌ పర్యవేక్షణలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో ఐదు రోజులపాటు నిర్వహించే గురుకులం కూచిపూడి నాట్య వర్క్‌షా్‌పను ఆదివారం ఆమె ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూచిపూడి, ఏప్రిల్‌ 23 : కూచిపూడిలో ఉన్నతులుగా ఎదగటానికి నాట్యానికి పునాది అయిన అడుగులు ఎంతో దోహద పడతాయని ప్రముఖ కూచిపూడి నాట్యాచారిణి, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత మంజుభార్గవి పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, కూచిపూడి సిద్దేంధ్ర కళాపీఠంలో సేవ్‌ కూచిపూడి ఆర్టిస్ట్‌ పర్యవేక్షణలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో ఐదు రోజులపాటు నిర్వహించే గురుకులం కూచిపూడి నాట్య వర్క్‌షా్‌పను ఆదివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన పలువురు నాట్య విద్యార్థులకు మంజుభార్గవి పలు సూచనలు ఇచ్చారు. స్వయంగా నాట్యభంగిమలు చేసి చూపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పద్మభూషణ్‌ డాక్టర్‌ వెంపటి చినసత్యం వద్ద ఆరు దశాబ్దాల క్రితం శిక్షణ పొందిన కూచిపూడిని నేటికీ అదే బాణీలో ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. ఆనాడు చినసత్యం వద్ద గల శేషు మాస్టర్‌ వద్ద నేర్చుకున ్న అడుగులే శంకరాభరణంలో నాట్య ప్రదర్శనకు మూలమన్నారు. నేడు కూచిపూడి అంటే తెలియని వారు సైతం కూచిపూడి పేరు మీద అవార్డులు పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ నాట్య విద్యార్థి అంకుఠిత దీక్షతో సాధన చేసి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. తొలుత కూచిపూడి నాట్యానికి ఆద్యుడైన శ్రీ సిదేంద్ర యోగి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి నాట్య శిక్షణా తరగతులు ప్రారంభించారు. సేవ్‌ కూచిపూడి నిర్వాహకురాలు భావన పెదప్రోలు, కళాపీఠం ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వేదాంతం రామలింగశాస్త్రి, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చింతా రవిబాలకృష్ణ, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ యేలేశ్వరపు శ్రీనివాసులు, చీటింగ్‌ అసిస్టెంట్స్‌ వెంకట దుర్గాభవాని, హరనాథ శాస్త్రి, బిస్మిల్లా ఖాన్‌ యువ పురస్కార్‌ అవార్డు గ్రహీత వసంత్‌ కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-24T01:21:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising