Vijayawada: సీఆర్డీయే కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన
ABN, First Publish Date - 2023-01-23T12:21:46+05:30
విజయవాడ: దళిత జేఏసీ అమరావతి (Dalit JAC Amaravati) ఆధ్వర్యంలో సీఆర్డీయే (CRDA) కార్యాలయం ఎదుట రైతులు (Farmers) ఆందోళనకు దిగారు.
విజయవాడ: దళిత జేఏసీ అమరావతి (Dalit JAC Amaravati) ఆధ్వర్యంలో సీఆర్డీయే (CRDA) కార్యాలయం ఎదుట రైతులు (Farmers) ఆందోళనకు దిగారు. అసైన్డ్ (Assigned) రైతులకు కౌలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ద్వారం వద్ద రైతులు బైటాయించారు. ఈ సందర్భంగా దళిత జేఎసి నేత మార్టిన్ (Martin) మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి (Jaganmohanreddy) మమ్మలను ఆదుకుంటామని హామీ ఇచ్చారని, అసైన్డ్ రైతులకు నేనున్నా అంటూనే... ఇవాళ నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా అసైన్డ్ రైతులకు కౌలు ఇవ్వడం లేదన్నారు. కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా ఉందన్నారు. అమరావతిలో అసైన్డ్ రైతుల ఆకలి కేకలు సీఎం జగన్‌కు పట్టవా? అని ప్రశ్నించారు. సీఆర్డీయే అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదన్నారు. సమావేశాల పేరుతో మమ్మలను తుళ్లూరు, విజయవాడలకు తిప్పుతున్నారని, వెంటనే అసైన్డ్ రైతులకు కౌలు చెల్లించేలా అధికారులు, ప్రభుత్వం స్పందించాలని మార్టిన్ విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2023-01-23T12:21:50+05:30 IST