రాజకీయ కక్షతోనే తప్పుడు కేసులు
ABN, First Publish Date - 2023-09-23T00:23:26+05:30
నియోజకవర్గం తెలుగుమహిళా ఆధ్వర్యంలో బాబుతో నేను అంటూ మహిళలు రిలేనిరాహార దీక్షలో పాల్గొన్నారు.
తిరువూరు, సెప్టెంబరు 22: నియోజకవర్గం తెలుగుమహిళా ఆధ్వర్యంలో బాబుతో నేను అంటూ మహిళలు రిలేనిరాహార దీక్షలో పాల్గొన్నారు. నియోజవర్గం పార్టీ కార్యాలయంలో శుక్రవారం జడ్పీ మాజీ చైర్‌పర్సన్ నల్లగట్ల సుధారాణి, నాదెళ్ల నాగమణి, మాజీ కౌన్సిలర్ నాళ్లా లక్ష్మి, రామకొటమ్మ, సాంబారు నాగలక్ష్మి, నల్లగట్ల రాఘవమ్మ తదితరులు దీక్షలో కూర్చున్నారు. టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి శావల దేవదత్, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. బొమ్మసాని మహేష్, సిందు శ్రీను, వాసం మునియ్య, గద్దె వెంకటేశ్వరరావు, ఆకుల ప్రసాద్ సంఘీభావం తెలిపారు. సాయంత్రం దేవదత్, తెలుగురైతు ఎన్టీఆర్‌జిల్లా అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
కుంటముక్కలలో..
జి.కొండూరు : కుంటముక్కలలో శుక్రవారం రిలే దీక్షలో పలువురు నాయకులు మాట్లాడుతూ విజన్ 2020 సృష్టికర్త అయిన చంద్రబాబును రాజకీయ కక్షతోనే ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందన్నారు. దీక్షలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జువ్వా రామకృష్ణ, పజ్జూరు రవికుమార్, లంక రామకృష్ణ, ఉయ్యూరు వెంకట నరసింహారావు, సుకవాసి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
మైలవరంలో పదో రోజుకు దీక్షలు
మైలవరం : మైలవరంలో తలపెట్టన రిలే దీక్షలు శుక్రవారం పదో రోజుకు చేరుకున్నాయి. దీక్షలో వెదురుబీడెం టీడీపీ నాయకులు పల్ల పోతుల శ్రీనివాసరావు, పల్లపోతుల వెంకట నారాయణ, కాలేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, షేక్ సుభాని (రెడ్డిగూడెం), రాసాల వెంకటేశ్వరరావు, కొండలరావు, అనిల్‌బాబు, సత్యనారాయణ, కొలుసు శ్రీనివాసరావు, నరేంద్ర, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఫ గొల్లపూడిలో ముస్లిం నేతలు దీక్షలో కూర్చొన్నారు. బాబుకు తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం అంటూ సిగ్నేచర్ బోర్డుపై పెద్ద ఎత్తున సంతకాలు చేశారు.
ఓటుతో ప్రజలు బుద్ధి చెబుతారు
ఇబ్రహీంపట్నం : సీఎం జగన్‌రెడ్డికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ చైర్మన్ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టిబాబు అన్నారు. నియోజకవర్గ బీసీ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం కొండపల్లిలో ఎనిమిదో రోజు రిలే దీక్షలను చిట్టిబాబు ప్రారంభించారు. కార్యక్రమంలో పీతా శ్రీనివాసరాజు, నిమ్మల రాజు, సాకిరి వెంకటనర్సయ్య, వేముల వెంకటకృష్ణ, మైలా సైదులుతదితరులు పాల్గొన్నారు.
నందిగామ : పట్టణ పార్టీ కార్యాలయంలో రిలే దీక్షలు శుక్రవారం పదో రోజుకు చేరుకున్నాయి. దీక్షను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, చంద్రబాబుపై కుట్రతో వ్యవస్థలను మానేజ్ చేస్తూ ముఖ్యమంత్రి జగన్‌ను ఆయన్న జైలు పాలు చేశాడన్నారు. ఒక్క ఆధారం కూడా లేకుండా జైలుకు పంపిన చరిత్ర జగన్‌దేనన్నారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని, త్వరలోనే చంద్రబాబు కడిగిన ముత్యంలా బయట పడతారన్నారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఏచూరి రామకృష్ణ, శాఖమూరి స్వర్ణలత, కాసర్ల లక్ష్మీనారాయణ, అమ్మినేని జ్వాలాప్రసాద్, కొంగర నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-23T00:23:26+05:30 IST