ప్రజల చెంతకు ఈవీ చార్జింగ్, మినీ గ్యాస్ సిలెండర్ స్టేషన్లు
ABN, First Publish Date - 2023-01-20T00:20:12+05:30
ప్రజలకు మరింత అందుబాటులోకి ఈవీ చార్జింగ్, మినీ గ్యాస్ సిలెండర్ స్టేషన్లు తీసుకురాన్నునట్టు ఐవోసీఎల్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ బి.అనిల్ కుమార్ తెలిపారు.
ఇబ్రహీంపట్నం: ప్రజలకు మరింత అందుబాటులోకి ఈవీ చార్జింగ్, మినీ గ్యాస్ సిలెండర్ స్టేషన్లు తీసుకురాన్నునట్టు ఐవోసీఎల్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ బి.అనిల్ కుమార్ తెలిపారు. కొండపల్లి ఐవోసీఎల్ ప్లాంట్ ఆవరణలో గురువారం విలేకరుల సమావేశంలో కంపెనీ నిర్వహిస్తున్న వివిధ సర్వీసుల గురించి వివరించారు. ఏపీలో రిటైల్ విభాగంలో ఐవోసీ మార్కెట్ లీడర్‌గా నిలిచిందని, పెట్రోల్ విభాగంలో 34.2శాతం, డీజిల్ విభాగంలో 40శాతం వాటాను సొంతం చేసుకుందని అన్నారు. ఐవోసీ 473 రిటైల్ అవుట్‌లెట్లను సోలరైజ్ చేసిందని, ఈ-మొబిలిటీ ధోరణికి అనుగుణంగా 138ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిందన్నారు. గృహ ఎల్పీజీ వ్యాపారంలో ఐవోసీ 34.6శాతం వాటా ఉందని పేర్కొన్నారు. ఏపీలో ఎల్పీజీ వినియోగదారుల సంఖ్య 1.5కోట్లు కాగా అందులో 51.5లక్షలు ఐవోసీ ఎల్పీజీ వాడుతున్నారన్నారు. పెట్రోల్‌లో ఎక్స్ 95ను పరిచయం చేసిందని వాహన శక్తిని 4శాతం మెరుగుపరచడంతో పాటు హైడ్రో కార్బన్ ఉద్గారాలను 13శాతం వరకు తగ్గిస్తుందని 3.95శాతం ఇంధన సామర్థ్యాన్ని అదనంగా ఇస్తుందని తెలిపారు. ఎక్ప్‌పి 100హై అక్టెన్ పెట్రోల్ హైఎన్డ్ వాహనాల కోసం విజయవాడలో ఎంపిక చేసిన ఔట్‌లెట్ వద్ద ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పట్టణాల్లో వలస ప్రజలకు 5కిలోల మినీ కుకింగ్ గ్యాస్ సిలెండర్‌లు ప్రవేశపెట్టినట్టు తెలిపారు. టెర్మినల్ చీఫ్ మేనేజర్ సాగర్, కార్పొరేట్ కమ్యూనికేషన్ చీఫ్ మేనేజర్ కె.మురళీ ఉద్యోగులు పాల్గొన్నారు.
Updated Date - 2023-01-20T00:20:15+05:30 IST