ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ

ABN, First Publish Date - 2023-08-06T01:10:57+05:30

కృష్ణా జిల్లాలో ఓటర్ల జాబితా సవ రణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల అధికా రులను కలెక్టర్‌ పి.రాజాబాబు ఆదేశించారు.

మాట్లాడుతున్న కృష్ణా కలెక్టర్‌ పి.రాజాబాబు

కృష్ణా కలెక్టర్‌ పి.రాజాబాబు

మచిలీపట్నం, ఆగస్టు 5: కృష్ణా జిల్లాలో ఓటర్ల జాబితా సవ రణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల అధికా రులను కలెక్టర్‌ పి.రాజాబాబు ఆదేశించారు. జేపీ అపరాజిత సింగ్‌, డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లుతో కలిసి జిల్లాలోని ఎన్నికల, క్షేత్రస్థాయి అధి కారులతో శనివారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ప్రతి మంగళవారం రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. సవరణలపై రాజకీయ పార్టీల నాయకులు అభ్యంతరాలు తెలియజేస్తే కేంద్ర ఎన్ని కల సంఘం నిబంధనల మేరకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను సమావేశానికి హాజరయ్యేలా చూడాలన్నారు. పాల్గొన్న రాజకీయ పార్టీల ప్రతినిధులు, బీఎల్వోల పేర్లను నమోదు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. 6, 7, 8 ఫాంల పూర్తి సమాచారం సమావేశంలో పాల్గొన్న వారికి అందజేయా లన్నారు. రాజకీయ పార్టీల నుంచీ ఓటర్ల తొలగింపు కోసం అధికంగా దరఖాస్తులు వస్తే వాటిపై విచారణ చేసి అన్నిరకాల ఆధారాలతో తొలగించాలన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికీ ఓటు హక్కు కల్పించేలా బీఎల్వోలు చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా ఉన్న ఓట్లను తొలగిస్తే బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఓటర్ల జనాభా నిష్పత్తి, లింగ నిష్పత్తి నిర్ణీత సంఖ్యకు మించి ఉంటే విచారణ చేయాలన్నారు. ఎన్నికల విధుల నుంచి ఎవరికీ మినహాయింపు ఉండదని, ప్రతి ఒక్కరూ వారికి అప్పగించిన పనిని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఏఈఆర్వోలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-06T01:10:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising