బలిపీఠాలపై ఎంగిలి నీళ్లు కుమ్మరింపు
ABN, First Publish Date - 2023-01-15T01:08:01+05:30
దుర్గగుడిలో మ రో అపచారం చోటు చేసుకుంది.
వన్‌టౌన్, జనవరి 14 : దుర్గగుడిలో మ రో అపచారం చోటు చేసుకుంది. ఇటీవల ఒక మహిళ మూల విరాట్టుతో సహా గ ర్భాలయ ఫొటోలు తీసి సంచలనం కలిగించగా శనివా రం ఉపాలయంగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద ఒక అనధికార అర్చకుడు ఆల యం చుట్టూ ఉండే బలిపీఠాల్లో ఒకదానిపై తాను మంచినీళ్లు తాగి మిగిలిన నీళ్లు పోయ డం చర్చనీయాంశమైంది. ఓ భక్తుడు చూసి ప్రశ్నించడంతో విషయం బయటకు వచ్చిం ది. ప్రశ్నించిన భక్తుడితో వివాదం పెట్టుకోవడంతో ఆ భక్తుడు ఈవో భ్రమరాంబకు తెలి యజేయడంతో అర్చకుడిని పిలిచి విచారిచ గా తప్పయిందని ఒప్పుకున్నాడు. దీంతో అతడికీ, సుబ్రహ్మణ్య ఆలయంలోనే పనిచేస్తున్న మరో అనధికార అర్చకుడికి చెరో రూ.5వేల చొప్పున జరిమానా విధించడంతో పాటు వా రినిపెట్టిన అధికార అర్చకుడికి రూ.10వేల జ రిమానా విధించారు. అనధికార అర్చకులను ఇకనుంచి కొండపైకి రావద్దంటూ ఈవో భ్ర మరాంబ ఆదేశాలు జారీ చేశారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలంటూ ఆదేశించారు,
సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఘనాపా టి గణేష్ అధికారిక అర్చకుడుగా ఉన్నారు. అలయానికి కొంచెం దూరంలో ఉన్న యాగశాలలో హోమం నిర్వహించిన ఆయన భక్తులకు ప్రసాదం ఇవ్వడానికి వెళ్లాడు, ఇంతలో సహాయకులుగా నియమించుకున్న ఇద్దరు అనఽధికార అర్చకుల్లో ఒకరైన సుబ్రహ్మణ్యం చేసిన నిర్వాకంతో దొరికిపోయాడు. తాను నీ ళ్లు తాగి మిగిలిన వాటిని బలిపీఠంపైకి పారపోశాడు. ఇది భక్తుడు గమనించడంతో వివా దం మొదలైంది.. బలిపీఠ పవిత్రతను, భక్తు ల మనోభావాలను దెబ్బతీయడం తప్పు కదా అని భక్తుడు ప్రశ్నిస్తే నీకెందుకు పోవయ్యా, నన్నే ప్రశ్నిస్తావా.. అదంతే అంటుండడంతో భక్తుడు ఈ అపచారాన్ని ఈవోకు తెలియపరిచాడు. దీంతో విచారణ చేపట్టిన ఈవో భ్రమ రాంబ ఇద్దరు అనఽధికార అర్చకులు సుబ్రహ్మ ణ్యం, కిషోర్ , అధికార అర్చకుడు గ ణేష్‌లనుంచి రాతపూర్వకంగా ఏం జరిగిందీ రాసివ్వమన్నారు సుబ్రహ్మణ్యం తన తప్పును అం గీకరించాడు, కాకపోతే వారిద్దరినీ అనధికారికంగా పెట్టుకోవడంతో పాటు వారి ప్రవర్తన ను గమనించకపోవడంతో ఘనపాఠీకి ఘ నంగానే జరిమానా విఽధించారు.
Updated Date - 2023-01-15T01:08:02+05:30 IST