ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గమ్మ సన్నిధిలో ప్రముఖులు

ABN, First Publish Date - 2023-02-15T01:09:37+05:30

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను మంగళవారం ఏపీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ రఘురాజు, పీవీవీ సూర్యనారాయణరాజు, ఎమ్మెల్యేలు బీ అప్పలనర్స య్య (గజపతినగరం), గొర్ల కిరణ్‌కుమార్‌ (ఎచ్చర్ల) దర్శించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వన్‌టౌన్‌, ఫిబ్రవరి 14 : ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను మంగళవారం ఏపీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ రఘురాజు, పీవీవీ సూర్యనారాయణరాజు, ఎమ్మెల్యేలు బీ అప్పలనర్స య్య (గజపతినగరం), గొర్ల కిరణ్‌కుమార్‌ (ఎచ్చర్ల) దర్శించుకున్నారు. వీరికి అధికారులు ప్రొటోకాల్‌ మర్యాదలు అందజేశారు. అమ్మవారి దర్శనానంతరం వేదపండితులు ఆశీస్సులు అందజేయగా అధికారులు ప్రసాదం, శేషవస్ర్తాలను అందించారు.

అమ్మవారిని దర్శించుకున్న కర్ణాటక మంత్రి

కర్ణాటక రాష్ట్ర మునిసిపల్‌ పరిపాలన, చిన్న పరిశ్రమలశాఖ మంత్రి ఎన్‌ నాగరాజు ఎంటీబీ మంగళవారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు ప్రొటోకాల్‌ మర్యాదల ను అందజేశారు. అమ్మవారి దర్శనానంతరం అర్చకులు ఆశీస్సులు, ప్రసాదం, శేషవస్త్రం ఇచ్చారు.

నిత్యాన్నదానానికి విరాళం

తిరుపతిలోని తిరుమలరెడ్డి నగర్‌కు చెందిన ఆర్‌ వీ కల్యాణ్‌చక్రవర్తి, ఆయన కుటుంబ సభ్యులు మం గళవారం దుర్గగుడికి విచ్చేసి దివంగత ఆర్‌ రామారావు, ప్రభావతి పేరిట అన్నదానం నిర్వహించేందు కు రూ.లక్ష విరాళాన్ని పాలకమండలి చైర్మన్‌ కర్నాటి రాంబాబుకు ఆందజేశారు. దుర్గమ్మ దర్శనానంతరం దాతలకు ప్రసాదం, శేషవస్త్రం, ఆశీస్సులు ఇచ్చారు.

Updated Date - 2023-02-15T01:09:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising