బోయ, వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చొద్దు
ABN, First Publish Date - 2023-07-11T00:47:21+05:30
రాష్ట్ర ప్రభుత్వం బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చటాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు యానాది మహానాడు రాష్ట్ర కార్యదర్శి నక్కా విజయబాబు పేర్కొన్నారు. గిరిజనేతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలంటే 1965లో లోకూర్ కమిటీ సూచించిన ప్రమాణాలను పాటించాలన్నారు. బోయ, వాల్మీకి కులాలను ఎస్టీలో చేరుస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ యానాది మహానాడు, కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం నాగాయలంక సెంటర్‌లో నిరసన ప్రదర్శన, మానవహారం చేసి తహసీల్దార్‌కి వినతిపత్రాన్ని అందజేశారు.
నాగాయలంక, జూలై 10 : రాష్ట్ర ప్రభుత్వం బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చటాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు యానాది మహానాడు రాష్ట్ర కార్యదర్శి నక్కా విజయబాబు పేర్కొన్నారు. గిరిజనేతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలంటే 1965లో లోకూర్ కమిటీ సూచించిన ప్రమాణాలను పాటించాలన్నారు. బోయ, వాల్మీకి కులాలను ఎస్టీలో చేరుస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ యానాది మహానాడు, కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం నాగాయలంక సెంటర్‌లో నిరసన ప్రదర్శన, మానవహారం చేసి తహసీల్దార్‌కి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో రాయలసీమలో బోయ, వాల్మీకులు ఓట్ల కోసం ఎస్టీల జాబితాలో జగన్మోన్‌రెడ్డి వారిని చేర్చారని విమర్శించారు. కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ మాట్లాడుతూ, మైదాన ప్రాంతాల్లో అత్యంత దుర్భర, దారిద్య్ర జీవితాన్ని గడుపుతున్న యానాది, ఎరుకుల, లంబాడ కులాల కడుపులు కొట్టి బోయ, వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చటం దారుణమన్నారు. తీర్మానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్టీ యానాదులు జెండాలను ప్రదర్శిస్తూ నిరసన ర్యాలీలో పాల్గొని, పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కోడూరు, నాగాయలంక మండలాల నుంచి యానాదులు భారీగా ర్యాలీలో పాల్గొన్నారు. మెలికా శ్రీనివాసరావు, తిరుమలశెట్టి శ్రీనివాస్, కొమరిగిరి నాగేశ్వరరావు, మంగళగిరి శ్రీనివాస్, తదితరులు మాట్లాడారు. జనసేన నేత గుడివాక శేషుబాబు ర్యాలీలో పాల్గొని సంఘీభావాన్ని తెలిపారు.
Updated Date - 2023-07-11T00:47:21+05:30 IST