ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాదక ద్రవ్యాలకు బానిసలు కావొద్దు : బాలస్వామి

ABN, First Publish Date - 2023-01-26T00:48:29+05:30

మాదక ద్రవ్యాలకు యువత, విద్యార్థులు బానిసలు కాకూడదని, మత్తు పదార్థాలను నిర్మూలించడం వల్ల మంచి సమాజాన్ని నిర్మించవచ్చని టీడీపీ ఫ్లోర్‌లీడర్‌, 23వ డివిజన్‌ కార్పొరేటర్‌ నెలిబండ్ల బాలస్వామి అన్నారు.

మాట్లాడుతున్న బాలస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాదక ద్రవ్యాలకు బానిసలు కావొద్దు : బాలస్వామి

గవర్నర్‌పేట, జనవరి 25: మాదక ద్రవ్యాలకు యువత, విద్యార్థులు బానిసలు కాకూడదని, మత్తు పదార్థాలను నిర్మూలించడం వల్ల మంచి సమాజాన్ని నిర్మించవచ్చని టీడీపీ ఫ్లోర్‌లీడర్‌, 23వ డివిజన్‌ కార్పొరేటర్‌ నెలిబండ్ల బాలస్వామి అన్నారు. నవజీవన్‌ బాలభవన్‌ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం సూర్యారావు పేటలోని శ్రీ కర్నాటి రామమోహన నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల తలెత్తే అనర్థాలపై స్ర్కీన్‌ ప్రొజెక్టర్‌ ద్వారా అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన బాలస్వామి మాట్లాడుతూ మాదకద్రవ్యాల వల్ల వచ్చే దుష్పరిణామాలపై విద్యా ర్థులు అవగాహన చేసుకుని సన్మార్గంలో జీవించాలని కోరారు. నవజీవన్‌ బాలభవన్‌ జోనల్‌ కో-ఆర్డినేటర్‌ జె. ఆంజనేయులు మాట్లాడుతూ మత్తు పదార్థాల జోలికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవద్దని హితవు పలికారు. నవజీవన్‌ బాలభవన్‌ జోనల్‌ కో-ఆర్డినేటర్‌ జె. వాణి, స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు ఎం. నాంచారయ్య, ఉపాధ్యాయుడు డి. సురేష్‌, సచివాలయ కార్యదర్శులు బి. కరుణ, డి. లలిత, ఎస్‌వీ స్వప్న, కరుణాదేవి పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:48:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising