పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించండి
ABN, First Publish Date - 2023-04-25T00:45:30+05:30
స్టేషన్ల పరిధిలో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరిం చాలని, వాటి సంఖ్యను తగ్గించాలని వెస్ట్‌జోన్ ఇన్‌చార్జి డీసీపీ విశాల్‌గున్ని భవానీ పురం, టూటౌన్ పోలీసు స్టేషన్ల అధికారులకు సూచించారు.
పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించండి
వెస్ట్‌జోన్ ఇన్‌చార్జి డీసీపీ విశాల్‌గున్ని
విద్యాధరపురం, ఏప్రిల్ 24: స్టేషన్ల పరిధిలో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరిం చాలని, వాటి సంఖ్యను తగ్గించాలని వెస్ట్‌జోన్ ఇన్‌చార్జి డీసీపీ విశాల్‌గున్ని భవానీ పురం, టూటౌన్ పోలీసు స్టేషన్ల అధికారులకు సూచించారు. సోమవారం ఆయన పోలీసు స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్ల పరిధిలో రెగ్యులర్ బీట్లను పెంచాలని, నేర నియంత్రణ చేయాలని సూచించారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుని పట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు. పోలీసుస్టేషన్ల పరిధిలో ప్రతి రోజూ సాయంత్రం విజువల్ పోలీసింగ్, ఫుల్ పెట్రోలింగ్‌ను నిర్వహించి ప్రజలకు తాము ఉన్నామన్న భరోసా కల్పించాలన్నారు. పోలీసు స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, విఽఽధులు, ముఖ్య కేసులు దర్యాప్తుకు సంబంధించి కేసు డైరీ, విలేజ్ రోస్టర్, పోలీసు స్టేషన్ పరిసరాలు, సీజ్ చేసిన వాహనాల పరిస్థితి, కంప్యూటర్ గది తదితరాలను ఆయన పరిశీ లించి పలు సూచనలు చేశారు.
Updated Date - 2023-04-25T00:45:30+05:30 IST