ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కుష్టు వ్యాధి నిర్ధారణకు సహకరించండి

ABN, First Publish Date - 2023-06-27T01:33:04+05:30

ఇంటింటి సర్వేలో భాగంగా కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించి సకాలంలో చికిత్స అందించాలని, వ్యాధిని సమూలంగా నిర్మూలించాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు అన్నారు. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జూలై 16వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించే కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ, జాతీయ ఆరోగ్య మిషన్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా కుష్టు వ్యాధిపై ప్రచురించిన అవగాహన పోస్టర్లు, కరపత్రాలను సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో కలెక్టర్‌ దిల్లీరావు ఆవిష్కరించారు.

గోవధ నిషేధ-పశుసంరక్షణ పోస్టర్‌ విడుదల చేస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌, జూన్‌ 26 : ఇంటింటి సర్వేలో భాగంగా కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించి సకాలంలో చికిత్స అందించాలని, వ్యాధిని సమూలంగా నిర్మూలించాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు అన్నారు. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జూలై 16వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించే కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ, జాతీయ ఆరోగ్య మిషన్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా కుష్టు వ్యాధిపై ప్రచురించిన అవగాహన పోస్టర్లు, కరపత్రాలను సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో కలెక్టర్‌ దిల్లీరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఇంటింటి సర్వే ద్వారా కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరూ సహకరించి శాశ్వత లోపాలు, అంగవైకల్య బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య, ఆశా కార్యకర్తలు, గ్రామ వలంటీర్లతో ఇంటింటి సర్వేలో వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించడం జరుగుతుందన్నారు. తొలి దశలోనే చికిత్స అందించడం ద్వారా వ్యాధిని అరికట్టవచ్చన్నారు. కుష్టు వ్యాధిని జిల్లాలో సమూలంగా నిర్మూలించి వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ వైద్యాధికారులను కోరారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ పి.సంపత్‌ కుమార్‌, డీఆర్‌వో కె.మోహన్‌కుమార్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం.సుహాసిని, జిల్లా లెప్రసీ, టీబీ, ఎయిడ్స్‌ ప్రోగ్రామ్‌ అధికారి డాక్టర్‌ ఉషారాణి, లేప్రా ఎన్‌జివో స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ రాధిక తదితరులు పాల్గొన్నారు.

గో వధ నిషేధ చట్టాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి

గోవధ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్‌ దిల్లీరావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా జంతు సంక్షేమ సంఘం చైర్మన్‌, కలెక్టర్‌ దిల్లీరావు అధ్యక్షతన రెవెన్యూ, పోలీస్‌, నగరపాలకసంస్థ, హిందు, ముస్లిం సంక్షేమ సంఘం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గోవధ నిషేద చట్టం అమలుపై సొసైటీ ఫర్‌ ప్రివేన్షన్‌ ఆఫ్‌ క్రూయాల్టీ టు యానిమల్స్‌ (ఎన్‌పిసిఏ) సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, బక్రీద్‌ సందర్భంగా గోవధ నియంత్రణకు మండల, డివిజన్‌ గ్రామస్థాయిలో సంబంధిత అధికారులతో చట్టాన్ని పర్యవేక్షించేలా ప్రత్యేక బృందాలు నియమించడం జరిగిందన్నారు. కబేళాలో మాత్రమే పశువులను వధించాలని అన్నారు. కబేళాలో ప్రస్తుతం ఉన్న పశు సంవర్ధక వైద్యునకు అదనంగా గొల్లపూడి, పటమట నుంచి ఇద్దరు వెటర్నరీ డాక్టర్‌లను నియమించడం జరిదిందన్నారు. వీరు జూలై 1వ తేది వరకు 24 గంటలు విధులను నిర్వర్తించేలా ఆదేశించామన్నారు. రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి ఆర్డీవో, పోలీస్‌ శాఖ నుంచి డీఎస్పీ, పశుసంవర్ధక శాఖ డిప్యూటి డైరెక్టర్‌ టీమ్‌ సభ్యులుగా, మండలానికి సంబంధించి పశుసంవర్ధక, తహసీల్ధార్‌, స్టేషన్‌ ఆఫీసర్లతో కూడిన ముగ్గురు సభ్యులు విధులు నిర్వర్తిస్తారన్నారు. మత సామరస్యంతో బక్రీద్‌ పండుగను ప్రశాంతంగా నిర్వహించుకుని జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్‌ కోరారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జేసీ పి.సంపత్‌ కుమార్‌, డీఆర్‌వో కె. మోహన్‌ కుమార్‌, డీసీపీ ఎం.సత్తిబాబు, పశుసంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కె.విద్యాసాగర్‌, బీఫ్‌ మర్చంట్స్‌ అండ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌ సెక్రటరీ, జాయింట్‌ సెక్రటరీలు ఎండీ రీజ్వాన్‌హుల్లా ఖురేషి, ఎండీ హతీమ్‌ ఖురేషి, నగరపాలకసంస్థ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ రత్నావళి, వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ రవిచంద్‌, జిల్లా మైనార్టీ వెల్ఫేర్‌ అధికారి షంసున్సీసా బేగం, వెస్ట్‌ సౌత్‌ నార్త్‌ సెంట్రల్‌ ఏసీపీలు, సంక్షేమ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-27T01:33:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising