టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం
ABN, First Publish Date - 2023-04-20T00:27:43+05:30
మచిలీపట్నం లేడీయాంప్తిల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. పరిశీలకుడు, సిమ్యాట్ డైరెక్టర్ మస్తానయ్య డీఈవో తాహెరా సుల్తానా, అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్‌రాజులను జవాబు పత్రాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మచిలీపట్నం టౌన్, ఏప్రిల్ 19 : మచిలీపట్నం లేడీయాంప్తిల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. పరిశీలకుడు, సిమ్యాట్ డైరెక్టర్ మస్తానయ్య డీఈవో తాహెరా సుల్తానా, అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్‌రాజులను జవాబు పత్రాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాల్యుయేషన్ ప్రక్రియలో ఏ విధమైన పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీఈవోకు మస్తానయ్య సూచించారు. మొదటి రోజు 159మంది చీఫ్ ఎగ్జామినర్లు, 479 మంది ఏఈలు, 148 మంది స్పెషల్ అసిస్టెంట్లు మూల్యాంకన ప్రక్రియలో పాల్గొన్నారు. క్యాంపు ఆఫీసర్‌గా డీఈవో వ్యవహరించగా డిప్యూటీ క్యాంపు ఆఫీసరుగా బందరు డీవైఈవో యూవీ సుబ్బారావు వ్యవహరించారు.
బయాలజీ, ఫిజిక్స్ ఇబ్బందులు అధిగమించేందుకు చర్యలు : డీఈవో
బయాలజీ, ఫిజిక్స్ జవాబు పత్రాల్లో తేడాలను గుర్తించేందుకు గుడివాడ ఎస్‌వీఎస్ పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, మొవ్వ హైస్కూల్ స్కూల్ అసిస్టెంట్ జాఫర్ షరీ్‌ఫలను నియమించారు. కొందరు విద్యార్థులు ఫిజిక్స్ జవాబు పత్రాల్లో బయాలజీ ప్రశ్నలకు జవాబులు రాశారు. బయాలజీ ప్రశ్నలకు ఫిజిక్స్ జవాబు పత్రాలు రాశారు. ఆయా పత్రాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి మూల్యాంకనం జరిపించారు. దీనికోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు డీఈవో తాహెరా సుల్తానా మీడియాకు తెలిపారు. అనారోగ్యం కారణంగా వాల్యుయేషన్‌కు హాజరు కాలేమని కొందరు ఉపాధ్యాయులు దరఖాస్తులు అందజేశారు. గణితం, ఇంగ్లీషు జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేందుకు మరికొందరు ఉపాధ్యాయులు అవసరమని స్పాట్ వాల్యుయేషన్ అధికారులు తెలిపారు. పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్‌రాజు, ప్రధానోపాధ్యాయుల సంఘం నాయకులు మోమిన్, ఎంఈవో దుర్గాప్రసాద్ తదితరులు పర్యవేక్షించారు.
Updated Date - 2023-04-20T00:27:43+05:30 IST