ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉచితంగా హెపటైటిస్‌ బీ డోసులు

ABN, First Publish Date - 2023-02-07T01:20:16+05:30

హెచ్‌ఐవీ, హైరిస్క్‌ గ్రూపులకు చెందిన వారికి హెపటైటిస్‌ బీ నిరోధక టీకా వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారా కాలేయ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌, ఫిబ్రవరి 6 : హెచ్‌ఐవీ, హైరిస్క్‌ గ్రూపులకు చెందిన వారికి హెపటైటిస్‌ బీ నిరోధక టీకా వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారా కాలేయ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు అన్నారు. స్థానిక పాతప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో యాంటీ రెట్రో వైరల్‌ థెరఫీ (ఏఆర్‌టీ) కేంద్రంలో ఉచిత హెపటైటిస్‌ వ్యాక్సినేషన్‌ను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హెపటైటిస్‌ బీ వ్యాధి నిరోధక టీకా వ్యాక్సిన్‌ను అన్ని ఏఆర్‌టీ కేంద్రాల్లో సోమవారం నుంచి ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. హెచ్‌ఐవీ, హైరిస్క్‌ గ్రూపుల వారికి హెపటైటిస్‌ బీ సోకే అవకాశం ఎక్కువగా ఉందని, కాబట్టి హెపటైటిస్‌ బీ నిరోధక టీకాలు తీసుకుంటే వ్యాధి బారిన పడకుండా రక్షణ పొందవచ్చన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్‌ మాచర్ల సుహాసిని, గాస్ర్టో ఎంట్రాలజీ హెచ్‌ఎడీ డాక్టర్‌ జగన్‌మోహన్‌రావు, జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్‌ జూపూడి ఉషారాణి, ఆసుపత్రి సూపరిండెంట్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సౌభాగ్యలక్ష్మి, జిల్లా ఇమ్యునైజేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అమృత, డిప్యూటి సూపరింటెండెంట్‌ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T01:20:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising