ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చీకటి పాలనకు త్వరలోనే స్వస్తి

ABN, First Publish Date - 2023-01-15T01:13:44+05:30

చీకటి పాలనకు స్వస్తి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జును డు అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద శనివారం టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీలను భోగి మంటల్లో వేసి దహనం చేశారు.

టీడీపీ గన్నవరం కార్యాలయం వద్ద భోగి మంటల్లో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గన్నవరం, జనవరి 14 : చీకటి పాలనకు స్వస్తి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జును డు అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద శనివారం టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీలను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. ఈ కార్యక్ర మంలో నాయకులు దొంతు చిన్న, జాస్తి వెంక టేశ్వరరావు, బోడపాటి రవికుమార్‌, జూపల్లి సురేష్‌, జాస్తి శ్రీధర్‌, చిరుమామిళ్ళ సూర్యం, బుస్సే నాగప్రసాద్‌, చిక్కవరపు నాగమణి, మల్లేశ్వరి, సుభాష్‌ చంద్రబోస్‌ పాల్గొన్నారు.

ఫ సూరంపల్లిలో తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు మండవ అన్వేష్‌ ఆధ్వర్యంలో ఎఫ్‌ఐఆర్‌ కాపీలను దహనం చేశారు. కాటూరి అభి, బడుగు కార్తిక్‌, ఓంకార్‌, సాయి తదితరులు పాల్గొన్నారు.

పెనమలూరు : సంక్రాంతి ప్రజల జీవితాల్లో పెనుమార్పులు తేవాలని, రాష్ట్రలో సైకో ప్రభుత్వం పోవాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, టీడీపీ నాయకులు ఆకాంక్షించారు. పోరంకి టీడీపీ కార్యాలయం వద్ద భోగి మంటలను వేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయ కులు అనుమోలు ప్రభాకరరావు, వెలగపూడి శంకరబాబు, కోయ ఆనంద ప్రసాద్‌, షేక్‌ బుజ్జి, దేవినేని రాజా, సంగెపు రంగారావు, సూదిమళ్ల రవీంద్ర, దొంతగాని పుల్లేశ్వరరావు, కుర్రా నరేంద్ర, అంగిరేకుల మురళి, శొంఠి శివరాంప్రసాద్‌, యార్లగడ్డ సుచిత్ర, మొక్కపాటి శ్రీనివాస్‌, ముసునూరి శ్రీధర్‌, మేడసాని రత్నకుమారి, విక్రమ్‌ పాల్గొన్నారు.

ఉయ్యూరు : రాజ్యాంగ వ్యతి రేకం జీవోలు జారీచేసి రాష్ట్ర ప్రభు త్వం ప్రజల హక్కులు హరిస్తుం దని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ ఆన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు 1 కాపీలను భోగిమంటల్లో తగుల బెట్టారు. రాజ్యాంగ, చట్ట వ్యతిరేక జీవోలు తేవ డం సిగ్గుచేటన్నారు.

హనుమాన్‌జంక్షన్‌ : ప్రజల హక్కులను కాలరాస్తు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం:1ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. శనివారం టీడీపీ బాపులపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి మంటలో జీవో కాపీలను దహనం చేస్తూ నిరసన తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో నాయకలు దయాల రాజేశ్వరరావు, పుట్టా సురేష్‌, ఆళ్ల గోపాలకృష్ణ, గుండపనేని ఉమా వరప్రసాద్‌, వేముపల్లి శ్రీనివాసరావు, చెన్నుబోయిన శివయ్య, మూ ల్పూరి సాయికల్యాణి, తుమ్మల జగన్‌, మండాది రవీంద్ర, గార్లపాటి రాజేశ్వరరావు, మజ్జిగ నాగరాజు పాల్గొన్నారు.

విజయవాడ రూరల్‌ : రాజ్యాంగం కల్పించిన హక్కులను వైసీపీ ప్రభుత్వం కాలరాయడం దుర్మర్గమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు దండు సుబ్రహ్మణ్యం రాజు అన్నారు. జీవో నెం 1ను రద్దు చేయాలని కోరుతూ నున్నలో టీడీపీ నేతలు జీవో కాపీ లను శనివారం భోగి మంటల్లో వేసి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేతలు మీరంపల్లి రాంబాబు, గుండాల సుబ్బారావు, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ జీవో నెం 1 రద్దు చేయాలని కోరుతూ అంబాపురంలో టీడీపీ నేతలు శనివారం జీవో కాపీలను భోగి మంటల్లో వేసి నిరసన తెలియ జేశారు. పార్టీ నాయకులు గొడ్డళ్ల చినరామా రావు నేతలు సత్యనారాయణ, సిద్దిల రాజా, బాబూరావు, శివయ్య, కోటయ్య పాల్గొన్నారు.

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ : ప్రజావ్యతి రేక విధానాలపై మాట్లాడే హక్కును ప్రజల నుంచి హరించడానికే జీవో నెం.1ని వైసీ పీతీసుకు వచ్చిందని టీడీపీ కోడూరుపాడు అధ్యక్షుడు కొండపల్లి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడూరుపాడులో శనివారం ఏర్పాటు చేసిన భోగిమంటల్లో జీవో నెం.1 ప్రతిని స్థానిక కార్యకర్తలతో కలిసి తగల బెట్టారు. ఈ కార్యక్రమంలో నూకల సాయి తేజ, కళ్లే రాజేష్‌, సలాది జగదీష్‌, రాంప్రసాద్‌, గరికపాటి రామ్మోహనరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-15T01:13:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising