సమాజాన్ని జాగృతం చేసే కార్టూన్లు
ABN, First Publish Date - 2023-10-05T00:12:28+05:30
కార్టూన్లు సమాజాన్ని జాగృతం చేస్తాయని, అత్యంత దగ్గరగా ప్రభావితం చేస్తాయని హిందూ హైస్కూల్ కమిటీ ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి మల్లయ్య అన్నారు.
సమాజాన్ని జాగృతం చేసే కార్టూన్లు
హిందూ హైస్కూల్ కమిటీ ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి మల్లయ్య
వన్‌టౌన్, అక్టోబరు 4: కార్టూన్లు సమాజాన్ని జాగృతం చేస్తాయని, అత్యంత దగ్గరగా ప్రభావితం చేస్తాయని హిందూ హైస్కూల్ కమిటీ ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి మల్లయ్య అన్నారు. కేబీఎన్ కళాశాలలో కోసా, ఉమెన్స్ స్టడీ సెంటర్ ఆధ్వర్యంలో కార్టూన్లపై నిర్వహించిన శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా కార్టూనిస్ట్‌లకు ప్రశంసా పత్రాలను ఆయన అందజేసి మాట్లాడుతూ చిట్టి చిట్టి బొమ్మలు అద్భుతమైన సందేశాన్ని అందించడమే కాకుండా ఆలోచింపచేస్తాయన్నారు. మానవ జీవితంలోని అనేక అంశాలను కార్టూన్లు ప్రతిభింబిస్తాయని సమాజాన్ని జాగృతం చేస్తాయని చెప్పారు. పొట్టి శ్రీరాములు చలువాది మల్లిఖార్జునరావు ఇంజనీరింగ్ కాలేజీ అధ్యక్షుడు చలువాది మల్లిఖార్జునరావు, కళాశాల కార్యదర్శి తూనుకుంట్ల శ్రీనివాస్, కమిటీ సభ్యులు యండూరి కిషోర్, కార్టూనిస్ట్‌లు నాగిశెట్టి, రాము, ప్రిన్సిపాల్ డాక్టర్ వి. నారాయణరావు, డాక్టర్ జి. కృష్ణవేణి, శిరీష పాల్గొన్నారు.
Updated Date - 2023-10-05T00:12:28+05:30 IST