ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు భరోసా సాయంపై జగన్‌ చెప్పేవన్నీ అబద్ధాలే

ABN, First Publish Date - 2023-06-03T00:40:34+05:30

రైతు భరోసా కింద నాలుగేళ్లలో ఒక్కో రైతుకు రూ.7500 ఇచ్చి రూ.61,500 ఇచ్చినట్టు సీఎం జగన్‌రెడ్డి కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్‌, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్‌ ధ్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌, జూన్‌ 2 : రైతు భరోసా కింద నాలుగేళ్లలో ఒక్కో రైతుకు రూ.7500 ఇచ్చి రూ.61,500 ఇచ్చినట్టు సీఎం జగన్‌రెడ్డి కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్‌, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్‌ ధ్వజమెత్తారు. తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ యోజన పథకం కింద రాష్ట్రంలో 36 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చామని చెబుతుండగా, జగన్‌రెడ్డి 52.30 లక్షల మందికి ఇచ్చినట్టు చెప్పడం అబద్ధం కాదా అని ప్రశ్నించారు. రైతుల నుంచి 45 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొని 75 లక్షల మెట్రిక్‌ టన్నులు కొన్నట్టు చెప్పడం దారుణమన్నారు. రైతు భరోసా, ధాన్యం సొమ్ము చెల్లింపులలో జాప్యం జరగడం వల్ల రైతులు అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం సా యం లేకుండానే చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కొక్క రైతుకు రూ. 15 వేలు అందించారన్నారు. 14 లక్షల కౌలు రైతులకు కూడా సాయం చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వం నాలుగేళ్ళలో 4వేల కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చిందన్నారు. జగన్‌రెడ్డి ఇచ్చింది రూ.1900 కోట్లేనన్నారు. వైసీపీ పాలనలో విత్తనం నుంచి విక్రయం వరకు రైతులు అడుగడుగునా మోసపోతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉం డగా, 32 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రం కొనుగోలు చేసిందన్నారు. చంద్రబాబు రాజమండ్రిలో ప్రకటించిన మేనిఫెస్టోతో వైసీపీ నాయకులకు దడ పట్టుకుందన్నారు.

Updated Date - 2023-06-03T00:40:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising