ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

9 నుంచి పుస్తకాల పండుగ

ABN, First Publish Date - 2023-02-02T00:55:18+05:30

ఈనెల 9 నుంచి 19వ తేదీ వరకూ నగరంలో పుస్తకాల పండుగ నిర్వహించాలని విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

10 రోజుల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు

ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గవర్నర్‌ హరిచందన్‌

విజయవాడ, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి) : ఈనెల 9 నుంచి 19వ తేదీ వరకూ నగరంలో పుస్తకాల పండుగ నిర్వహించాలని విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ నిర్ణయించింది. ఇప్పటి వరకు పుస్తక మహోత్సవం బందరు రోడ్డులోని స్వరాజ్య మైదానంలో జరిగేది. ఈ ఏడాది కొత్తగా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ ప్రతినిధులు విజయ్‌కుమార్‌, మనోహర్‌ నాయుడు, బెల్లం బాబ్జీ, కె.లక్ష్మయ్య బుధవారం సాయంత్రం వెల్లడించారు. 9వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఈ పుస్తక ప్రదర్శనను గవర్నర్‌ హరిచందన్‌ ప్రారంభిస్తారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి, కలెక్టర్‌ దిల్లీరావు, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయబాబు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ గౌరవ అతిథులుగా హాజరవుతారు. పుస్తక మహోత్సవాల్లో రెండు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన వేదికకు గొల్లపూడి మారుతీరావు సాహిత్య వేదికగా నామకరణం చేయగా, ప్రతిభా వేదికకు సత్యజిత్‌రే పేరును పెట్టారు. శతజయంతి, సాహిత్య కార్యక్రమాలు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణ కార్యక్రమాలను గొల్లపూడి మారుతీరావు వేదికపై నిర్వహిస్తారు. ప్రతిభా వేదికపై సినీ దర్శకులు అక్కినేని కుటుంబరావు, సి.ఉమామహేశ్వరరావు ప్రతిరోజూ వివిధ అంశాలపై విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తారు. 9వ తేదీ సాయంత్రం ఏడు గంటలకు సాహిత్య సంబరాల ప్రారంభ సభ జరుగుతుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఈ పుస్తక ప్రదర్శనకు దేశ నలుమూలల నుంచి మొత్తం 200 మంది ముద్రణకర్తలు హాజరవుతారని ప్రతినిధులు తెలిపారు. దీనికి తగ్గుట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

13న పుస్తకప్రియుల పాదయాత్ర

ఈనెల 13వ తేదీన పుస్తకప్రియుల పాదయాత్ర జరుగుతుంది. గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌ నుంచి యాత్ర మొదలవుతుంది. అనంతరం పుస్తక మహోత్సవ ప్రాంగణంలో సభ నిర్వహిస్తారు. ఈ సభకు ఎన్నికల కమిషనర్‌ ముఖేష్‌కుమార్‌ మీనా, గవర్నర్‌ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా ముఖ్యఅతిథులుగా హాజరవుతారు.

Updated Date - 2023-02-02T00:55:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising