వైసీపీ ప్రభుత్వ అవినీతి వల్లే ధరల పెరుగుదల : కాగిత
ABN, First Publish Date - 2023-07-07T02:04:52+05:30
ధరలు, పన్నులు, ఛార్జీలు విపరీతంగా పెరగడానికి వైసీపీ పాలకుల అవినీతే కారణమని పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి కాగిత కృష్ణప్రసాద్ ధ్వజమెత్తారు.
పెడన : ధరలు, పన్నులు, ఛార్జీలు విపరీతంగా పెరగడానికి వైసీపీ పాలకుల అవినీతే కారణమని పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి కాగిత కృష్ణప్రసాద్ ధ్వజమెత్తారు. గూడూరు మండలం రామన్నపేట, మల్లవోలు గ్రామాల్లో గురువారం భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, పరిపాలనా దక్షుడైన చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఎంతో అవసరమన్నారు. రామన్నపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కృష్ణప్రసాద్ ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహానాడులో చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. సాదరబోయిన ఏడుకొండలు, అర్జా వెంకట నగేష్, పోతన స్వామి, గోపీ నాగబాబు, కట్టా మునీశ్వరరావు, ఎన్‌ఏ బేగ్, సిరివెళ్ళ శ్రీనివాసరావు, శలపాటి ప్రసాద్, శీరం ప్రసాద్, కాట్రగడ్డ సత్యనారాయణ, కూనపరెడ్డి పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. వార్డు లభించింది.
Updated Date - 2023-07-07T02:04:52+05:30 IST