ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
ABN, First Publish Date - 2023-03-05T00:28:31+05:30
ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని ఎన్‌డీఆర్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ పింటు నంది అన్నారు. రామవరప్పాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొండ పావులూరు సర్వే నెంబర్ 6లోని 10వ ఎన్‌డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు ప్రమాదాలపై అవగాహన కల్పించారు.
రామవరప్పాడు(గన్నవరం), మార్చి 4 : ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని ఎన్‌డీఆర్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ పింటు నంది అన్నారు. రామవరప్పాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొండ పావులూరు సర్వే నెంబర్ 6లోని 10వ ఎన్‌డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు కంగారు పడకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. వరదలు, భూకంపాలు, మంటలు వ్యాపిం చినప్పుడు ఏ విధంగా అక్కడ ప్రజలను రక్షించాలో మాక్ డ్రిల్ చేసి, చూపించారు. హెచ్‌ఎం ఎస్‌ఏవి తయారు, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2023-03-05T00:28:31+05:30 IST