ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుట్టిన రోజు వేడుక కాకుండానే..

ABN, First Publish Date - 2023-06-07T00:43:24+05:30

తెల్లవారితే పుట్టినరోజు.. జన్మదిన వేడుక జరుపుకోకుండానే విగతజీవిగా మారాడు. చల్లపల్లి మండలం లక్ష్మీపురం దళితవాడకు చెందిన చిగురుపల్లి వాసు కుమారుడు వినయ్‌(23) పుచ్చగడ్డ రోడ్డులో మంగళవారం ఉదయం రక్తపు మడుగులో శవమై ఉండటం స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేకెత్తించింది.

సంఘటనా స్థలంలో పోలీసుల పరిశీలన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చల్లపల్లి, జూన్‌ 6 : తెల్లవారితే పుట్టినరోజు.. జన్మదిన వేడుక జరుపుకోకుండానే విగతజీవిగా మారాడు. చల్లపల్లి మండలం లక్ష్మీపురం దళితవాడకు చెందిన చిగురుపల్లి వాసు కుమారుడు వినయ్‌(23) పుచ్చగడ్డ రోడ్డులో మంగళవారం ఉదయం రక్తపు మడుగులో శవమై ఉండటం స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేకెత్తించింది. మృతుడి మెడ కింద భాగం లోతుగా కోసి ఉండటంతో దారుణహత్యకు గురయ్యాడా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా అన్నది తేలాల్సి ఉంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీపురం దళితవాడకు చెందిన ఆటోడ్రైవర్‌ వాసు కుమారుడు వినయ్‌ ప్రతిరోజూ మాదిరిగానే సోమవారం రాత్రి ఇంటిలో భోజనం చేసి సమీపంలోని అమ్మమ్మ ఇంటికి పడుకునేందుకు వెళ్లాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లివస్తానని వెళ్లి తిరిగిరాలేదు. ఉదయం పుచ్చగడ్డ డొంక రోడ్డులో పొలం గట్టున వేపచెట్టు కింద శవమై పడిఉండటాన్ని స్థానికులు చూసి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వినయ్‌ మెడ కింద లోతుగా కోసి ఉండటంతో మృతిచెందినట్టు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు లక్ష్మీపురం చేరుకుని విచారణ చేపట్టారు. అవనిగడ్డ డీఎస్పీ పి.మురళీధర్‌, చల్లపల్లి సీఐ బి.భీమేశ్వర రవికుమార్‌, ఎస్‌ఐ సిహెచ్‌.చిన్నబాబులు సంఘటనా ప్రదేశాన్ని పరిశీలించి మృతదేహాన్ని, గాయాలను పరిశీలించారు. క్లూస్‌ టీం బృందం సంఘటనా స్థలంలో ఆధారాలకోసం అన్వేషించారు. వినయ్‌ బి.టెక్‌ చదివి విజయవాడ, రాజమండ్రిలలో బ్యాంకు ఉద్యోగానికి కోచింగ్‌ తీసుకుని కొంతకాలం కిత్రం స్వగ్రామం వచ్చేశాడు. ప్రస్తుతం మేస్త్రితో కలిసి టైల్స్‌ పనికి వెళుతున్నాడు. మంగళవారం వినయ్‌ పుట్టినరోజు కాగా, స్నేహితులు కేక్‌ కట్‌చేద్దామని అడిగినప్పటికీ వద్దని ఇంటికి వచ్చేసినట్టు చెబుతున్నారు. మృతదేహంపై బ్లేడు, పర్సులో మరో బ్లేడును పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ప్రేమ వ్యవహారంతో ఆత్మహత్య చేసుకున్నాడా.. ఏవైనా వివాదాల నేపధ్యంలో ఎవరైనా హత్యచేశారా అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. యువకుడి మృతిపై కుటుంబ సభ్యులు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు.

Updated Date - 2023-06-07T00:43:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising