అక్రమ కేసులతో గొంతు నొక్కలేరు
ABN, First Publish Date - 2023-03-05T00:24:22+05:30
అక్రమ కేసులతో ప్రజల గొంతు నొక్కలేరని పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. శని వారం బెయిల్‌పై విడుదలైన పట్టాభికి స్వాగతం పలికేందుకు టీడీపీ బాపుల పాడు మండల నాయకులు బైపాస్‌లో ఏర్పాట్లు చేశారు.
హనుమాన్‌జంక్షన్ రూరల్, మార్చి 4 : అక్రమ కేసులతో ప్రజల గొంతు నొక్కలేరని పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. శని వారం బెయిల్‌పై విడుదలైన పట్టాభికి స్వాగతం పలికేందుకు టీడీపీ బాపుల పాడు మండల నాయకులు బైపాస్‌లో ఏర్పాట్లు చేశారు. కాన్వాయ్‌ను ఆపేం దుకు పోలీసులు అనుమతించక పోవటంతో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, తదితర నాయకులను కలిసి తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌రెడ్డి ప్రభుత్వంలో అక్రమ కేసులతో టీడీపీ నాయకులను వేధిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కంపసాటి కొండలరావు, జాస్తి భూపతిరావు, అరుమళ్ల కృష్ణారెడ్డి, సూరపనేని రంగారావు, మాదాల శ్రీను, వెంకటేశ్వరరావు, బేత శేషుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫగన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటన లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో శనివారం బెయిల్‌పై విడుదలైన కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తదిత రులను బాపులపాడు మండల రైతు నాయ కులు రాజమండ్రిలో కలిసి తమ సంఘీభా వం తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొం తు చిన్నా, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి వీరంకి గురుమూర్తి, బందరు పార్లమెంటరీ కమిటీ ఉపాధ్యక్షుడు గుజ్జర్లపూడి బాబూ రావును కలిశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆళ్ల గోపాలకృష్ణ, గుండపనేని ఉమా వరప్రసాద్, వేములపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పెనమలూరు : గన్నవరం ఘటనలో ప్రభుత్వ అక్రమ కేసులతో అరెస్టయి, బెయిల్‌పై విడుదలైన పట్టాభి, దొంతు చిన్నాలకు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్‌రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులతో ప్రతిపక్షాల గొంతు నొక్కలేదని వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-03-05T00:24:22+05:30 IST