ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ బండ బాదుడు

ABN, First Publish Date - 2023-03-02T00:47:14+05:30

మోదీ ప్రభుత్వం ప్రతి ఇంటిలో గ్యాస్‌ బాంబు పేల్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు అన్నారు. పెరిగిన గ్యాస్‌ ధరలకు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో బీసెంట్‌ రోడ్డు మహంతి చేపల మార్కెట్‌ సమీపంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్యాస్‌ బండ నెత్తిన పెట్టుకుని మహిళలు మోదీ ప్రభుత్వ దుర్మార్గంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెంచిన ధర తగ్గించాలని బీసెంట్‌ రోడ్డులో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గవర్నర్‌పేట, మార్చి 1 : మోదీ ప్రభుత్వం ప్రతి ఇంటిలో గ్యాస్‌ బాంబు పేల్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు అన్నారు. పెరిగిన గ్యాస్‌ ధరలకు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో బీసెంట్‌ రోడ్డు మహంతి చేపల మార్కెట్‌ సమీపంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్యాస్‌ బండ నెత్తిన పెట్టుకుని మహిళలు మోదీ ప్రభుత్వ దుర్మార్గంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ధరలు తగ్గించాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ, ఒక్కరోజులో వంటగ్యాస్‌ సిలెండర్‌ ధర్‌ రూ. 50, కమర్షియల్‌ సిలెండర్‌ ధర రూ. 350లు పెంచడం కేంద్రం చేసిన పెద్ద పాపమన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌పై సబ్సిడీకి పూర్తిగా ఎగనామం పెట్టిందన్నారు. ప్రపంచంలో గ్యాస్‌, పెట్రోలు ధరలు తగ్గుతుండగా దేశంలో పెంచడం సిగ్గుచేటన్నారు. వంట గ్యాస్‌ ధరల పెంపునకు వ్యతిరేకంగా ప్రజలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వ దుర్మార్గాలపై మార్చి నెల మొత్తం సీపీఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జగన్‌ బటన్‌ నొక్కినా ప్రజల ఖాతాల్లో డబ్బు పడటం లేదని, ప్రజల జేబుల్లోని డబ్బులు మాత్రం ప్రజలకు తెలియకుండానే ధరలు పెంచి దోచుకుంటున్నారన్నారు. ప్రజలపై భారాలు మోపుతున్న బీజేపీతో జతకట్టడానికి ప్రయత్నిస్తున్న పార్టీలకు కూడా ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మోదీకి దాసోహం అంటారో, నిలదీస్తారో ఈ పార్టీల నేతలు తేల్చుకోవాలన్నారు. చిత్తశుద్ధి ఉంటే గ్యాస్‌ ధరల పెంపుపైన, కేంద్రం మోపిన భారాలపైన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపైన వైఎస్‌ జగన్‌, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ నోరువిప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కుని పన్నులు, ధరల భారాలు ప్రజలపై మోపుతున్నారని, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన రెండు రోజుల్లోనే గ్యాస్‌ ధర పెంచడం ప్రజలను దొంగదెబ్బతీయడమే అన్నారు. నిరసన కార్యక్రమంలో సీపీఎం నేతలు దోనేపూడి కాశీనాథ్‌, డీవీ కృష్ణ, కె.శ్రీదేవి, బోయి సత్తిబాబు, బి.రమణ, కె.దుర్గారావు, పి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T00:47:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!