ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీడీపీ ఫ్లెక్సీల తొలగింపు

ABN, First Publish Date - 2023-07-15T01:00:44+05:30

విజయవాడ రూరల్‌ మండలం నున్న గ్రామంలో రెండు రోజుల క్రితం టీడీపీ నేతల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లను పంచాయతీ అధికారులు తొలగించడంపై శుక్రవారం ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నున్నలో టీడీపీ ఫ్లెక్సీలు తొలగిస్తున్న పంచాయతీ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నున్నలో రెండు రోజుల క్రితం కట్టిన ఫ్లెక్సీలు తొలగించిన పంచాయతీ అధికారులు

రెండు నెలల నుంచి గ్రామంలో వైసీపీ ఫ్లెక్సీలు.. వాటి జోలికెళ్లని సిబ్బంది

విజయవాడ రూరల్‌, జూలై 14: విజయవాడ రూరల్‌ మండలం నున్న గ్రామంలో రెండు రోజుల క్రితం టీడీపీ నేతల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లను పంచాయతీ అధికారులు తొలగించడంపై శుక్రవారం ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ బస్సుయాత్రతో పాటుగా నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు సంఘీభావంగా గ్రామంలోని నూజి వీడు రహదారితో పాటు వివిధ ప్రాంతాల్లో నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం నుంచి పంచాయతీ అధికారులు బ్యానర్ల తొలగింపు చేపట్టారు. వైసీపీ బ్యానర్లు ఉన్నా, కేవలం టీడీపీ బ్యానర్లు మాత్రమే తొలగించడంపై వారు ఆందోళనకు దిగారు.

పోలీసులకు ఫిర్యాదు

టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దండు సుబ్రహ్మణ్యంరాజుతో పాటు గంపా శ్రీనివాస యాదవ్‌, శ్రీనివాసరెడ్డి పలువురు నేతలు పంచాయతీ అధికారులను సంప్రదిం చేందుకు ప్రయత్నించారు. ఈవోతో సహా సిబ్బంది ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ చేసి అందు బాటులో లేకపోవడంతో నేరుగా ఈవో ఇంటికి వెళ్లారు. బ్యానర్ల తొలగింపుపై ప్రశ్నిం చారు. బ్యానర్ల తొలగించడం తనకు తెలియదని ఈవో చెప్పారు. దీంతో టీడీపీ నేతలు నున్న రూరల్‌ సీఐకి ఫిర్యాదు చేశారు. రెండు నెలలుగా గ్రామంలో ఉన్న వైసీపీ బ్యానర్లను తొలగించకుండా టీడీపీ రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించడంపై అసహనం వ్యక్తం చేశారు. బ్యానర్ల తొలగింపు ఈవో తెలియదని చెబతున్నారని, ప్రైవేట్‌ వ్యక్తులు తొలగిస్తే చర్యలు తీసుకోవాలని సీఐని కోరారు.

Updated Date - 2023-07-15T01:00:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising