ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

27, 28, 29 తేదీల్లో ఆధార్‌ ప్రత్యేక క్యాంపులు

ABN, First Publish Date - 2023-03-24T01:00:45+05:30

ఆధార్‌ అప్‌డేట్‌ కోసం ఈ నెల 27, 28, 29 తేదీల్లో జిల్లాలో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ రంజిత్‌బాషా తెలిపారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎ్‌స.జవహర్‌రెడ్డి గురువారం అమరావతి సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మచిలీపట్నం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : ఆధార్‌ అప్‌డేట్‌ కోసం ఈ నెల 27, 28, 29 తేదీల్లో జిల్లాలో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ రంజిత్‌బాషా తెలిపారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎ్‌స.జవహర్‌రెడ్డి గురువారం అమరావతి సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఆధార్‌ కార్డుల అప్‌డేట్‌ జిల్లాలో 55శాతం పూర్తయిందన్నారు. ఆరేళ్ల వయసున్న బాలలకు ఆధార్‌కార్డులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఆధార్‌ అప్‌డేట్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, వారం రోజుల్లో దీనిపై సమీక్ష నిర్వహిస్తామని కలెక్టర్‌ తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గర్భవతులు, బాలింతలు, కిశోరబాలికల్లో అనీమియా నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. వైఎస్సార్‌ సంపూర్ణ పోషకాహారం నూరుశాతం తీసుకునేలా పర్యవేక్షణ చేయాలన్నారు. పాఠశాలల్లో డ్రాపవుట్స్‌ను గుర్తించి బడిలో చేర్చేలా విద్యాశాఖ అధికారులు, టీచర్లు కృషిచేయాలన్నారు. సచివాలయాల్లోని వెల్ఫేర్‌, విద్యావిభాగం, మహిళా పోలీ్‌సలు తరచూ పాఠశాలలను తనిఖీచేసి నిర్థేశించిన లక్ష్యాలను సాధించేలా పర్యవేక్షణ చేయాలన్నారు. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభం కానున్న నేపధ్యంలో విద్యాశాఖ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. గృహనిర్మాణం, జగనన్న కాలనీల్లో మౌలికవసతుల అంశాలపైనా మండల ప్రత్యేక అధికారులు దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో జేసీ అపరాజిత సింగ్‌, డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, డీఎంఅండ్‌హెచ్‌వో గీతాబాయి, డీఈవో తాహెరాసుల్తానా, ఐసీడీఎస్‌ పీడీ ఎస్‌.సువర్ణ, డీఎల్‌డీవో సుబ్బారావు.్లసీపీవో శ్రీలత, డీర్‌ఆర్డీఎ పీడీ పీఎ్‌సఆర్‌ ప్రసాద్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-24T01:00:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising