భవనంపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య
ABN, First Publish Date - 2023-01-18T00:40:32+05:30
భవనంపై నుంచి దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.
భవనంపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య
అజిత్‌సింగ్‌నగర్, జనవరి 17 : భవనంపై నుంచి దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం విశాఖపట్నంకు చెందిన పెద్దపల్లి వికాస్(25) ఐదేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం నగరానికి వచ్చాడు. మద్యానికి బానిసైన యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ హిజ్రాతా సహజీవనం చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి తాను భవనంపై నుంచి దూకి చనిపోతానంటూ బంధువులకు ఫోన్ చేశాడు. బంధువులు వికాస్ ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లే సరికి మూడు అంతస్థుల భవనం ఎక్కి దూకేశాడు. తీవ్రంగా గాయపడ్డ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఫకీర్‌గూడెంలో పెయింటర్...
వన్‌టౌన్: ఫకీర్‌గూడెంకు చెందిన గద్దల కృష్ణ (25) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు తండ్రి నాగరాజు సమాచారం మేరకు కృష్ణలంక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణ తల్లి దండ్రులు కుటుంబాల కలహాల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు. కృష్ణ తల్లివద్దే ఉంటూ పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. సోమవారం తల్లి కృష్ణకు వెయ్యి రూపాయలు ఇచ్చి ఊరెళ్లింది. ఇంట్లోనే ఉన్న కృష్ణ సాయంత్రం సమయంలో ఉరేసుకున్నాడు. స్థానికులు గమనించి సమీపంలో ఉంటున్న అతని తండ్రి నాగరాజుకు సమాచారమిచ్చారు. పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
Updated Date - 2023-01-18T00:40:34+05:30 IST