సింగ్‌నగర్‌లో రెండో ఫ్లైఓవర్ నిర్మించాలి
ABN, First Publish Date - 2023-05-30T01:58:51+05:30
తక్షణమే రెండో ఫ్లైఓవర్ నిర్మించాలి అని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సీపీఐ నేతలతో కలిసి కలెక్టర్ దిల్లీరావుకు ఆ పార్టీ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు వినతిపత్రాన్ని అందించారు.
స్పందనలో కలెక్టర్ దిల్లీరావుకు సీపీఐ వినతిపత్రం
అజిత్‌సింగ్‌నగర్, మే 29: ‘‘జనాభా, వాహనాల రాకపోకలు పెరిగాయి. అజిత్‌సింగ్ నగర్, పాయకాపురం, నున్న జాతీయ రహదారిని అనుసంధానం చేసే సింగ్‌నగర్ ఫ్లైఓవర్‌పై ప్రయాణం ఇబ్బందిగా ఉంది. వాహనదారులకు రాక పోకలు కష్టంగా మారాయి. తక్షణమే రెండో ఫ్లైఓవర్ నిర్మించాలి.’’ అని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సీపీఐ నేతలతో కలిసి కలెక్టర్ దిల్లీరావుకు ఆ పార్టీ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు వినతిపత్రాన్ని అందించారు. నేతలు నక్కా వీరభద్రరావు, కేవీ భాస్కరరావు పాల్గొన్నారు.
Updated Date - 2023-05-30T01:58:51+05:30 IST