117వ రోజుకు మొబైల్ అన్న క్యాంటీన్
ABN, First Publish Date - 2023-03-29T00:52:25+05:30
టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని శివనాథ్ (చిన్ని) సౌజన్యంతో, కేశినేని ఫౌండే షన్ వారిచే నడపబడుతున్న మొబైల్ అన్న క్యాంటీన్ 117వ రోజుకు చేరుకుంది
117వ రోజుకు మొబైల్ అన్న క్యాంటీన్
చిట్టినగర్, మార్చి 28: టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని శివనాథ్ (చిన్ని) సౌజన్యంతో, కేశినేని ఫౌండే షన్ వారిచే నడపబడుతున్న మొబైల్ అన్న క్యాంటీన్ 117వ రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగా మంగళ వారం స్థానిక 46వ డివిజన్, నాగమ్మ సత్రం వద్ద మొబైల్ అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టి నాగుల్‌మీరా మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు తిరిగి రాష్ర్టానికి ఎప్పుడు ముఖ్యమంత్రిని చేద్దాం అని ప్రజలు కాచుకొని ఉన్నారని స్పష్టం చేశారు. అనంతరం కేక్ కట్‌చేసి నాయకులకు, కార్యకర్తలకు అందజేశారు. నాయకులు గుర్రం కొండ, కాజా రహమతుల్లా, నాగోతి రామారావు, ప్రభుదాస్, పి. లోకేష్, బెవర జోగేశ్వరరావు, నరేష్, శ్రీను, హుస్సేన్ పాల్గొన్నారు.
Updated Date - 2023-03-29T00:52:25+05:30 IST