ప్రతిభకు దర్పణం..విద్య, వైజ్ఞానిక ప్రదర్శన
ABN, First Publish Date - 2023-02-21T01:29:44+05:30
మచిలీపట్నంలో సోమవారం నిర్వహించిన కృష్ణాజిల్లా విద్య, వైజ్ఞానిక ప్రదర్శన బాల సైంటిస్టుల ప్రతిభకు దర్పణం పట్టింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు పర్యావరణ హితాన్ని కోరుతూ ప్రదర్శించిన ప్రాజెక్టులు అందరినీ ఆలో చింపజేశాయి.
మచిలీపట్నం టౌన్, ఫిబ్రవరి 20: మచిలీపట్నంలో సోమవారం నిర్వహించిన కృష్ణాజిల్లా విద్య, వైజ్ఞానిక ప్రదర్శన బాల సైంటిస్టుల ప్రతిభకు దర్పణం పట్టింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు పర్యావరణ హితాన్ని కోరుతూ ప్రదర్శించిన ప్రాజెక్టులు అందరినీ ఆలో చింపజేశాయి. 126 పాఠశాలల నుంచి 131 ప్రాజెక్టులు ప్రదర్శించారు. ప్రదర్శన ప్రారంభోత్సవ సభలో కాకినాడ విద్యాశాఖ ఆర్జేడీ నాగమణి అతిథిగా పాల్గొని ప్రసం గించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ జమలపూర్ణమ్మ, డీవై ఈవో యూవీ సుబ్బారావు, ప్రధానోపాధ్యాయుల సంఘ అధ్యక్షుడు మోమిన్, ఏడీ అజీజ్, పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్‌రాజు, జిల్లా సైన్సు కాంగ్రెస్ కార్యదర్శి హుస్సైన్ మాట్లాడారు. నగరలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రాజెక్టులను తిలకించారు.
సైన్స్ ప్రయోగాలకు ప్రాధాన్యం ఇవ్వండి: జేసీ
విద్యార్థులు సైన్స్ ప్రయోగాలకు ప్రాధాన్యమివ్వాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజితసింగ్ పేర్కొన్నారు. జిల్లా విద్య, వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు సందర్భంగా సోమవారం రాత్రి బహుమతి ప్రదా నోత్సవ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమ తులు అందజేశారు. ఆరోగ్య విభాగంలో జమీగొల్వేపల్లి విద్యార్థి ఎం. శాంతి ప్రథమ, తలగడదీవి విద్యార్థి కె.హర్షితకు ద్వితీయ, పర్యావ రణ సామగ్రి విభాగంలో కె.జయంత్, మానికొండ విద్యార్థి జమున, యాప్స్ విభాగంలో సంగమూడి విద్యార్థి పావని, మలపరాజుగూడెం విద్యార్థి జి.బాలమణికంఠ, పర్యావరణ మార్పులు అంశంలో వి.కానూరు విద్యార్థిని తబిత, కలవపాముల విద్యార్థి పి.నిఖిల్ రాం మ్యాథమెటికల్ మోడలింగ్‌లో వీరపనేనిగూడెం విద్యార్థి నవ్యశ్రీ, మొవ్వ హైస్కూలు విద్యార్థి సింధుకు వరుసగా ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేశారు. వీరంతా రాష్ట్ర పోటీలకు ఎంపికైనట్టు డీఈవో తాహెరా సుల్తానా తెలిపారు.
28న రాష్ట్రస్థాయి ప్రదర్శనకు సిద్ధంకండి: ఆర్జేడీ
జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించిన విద్యార్థులు తమ ప్రాజెక్టులను విజయవాడ లయోల కళాశాలలో ఈనెల 28న నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు తీసుకుని రావాలని ఆర్జేడీ నాగమణి సూచించారు. పెడన, మల్లవోలు పాఠశాలల ప్రాజెక్టులు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం ముదావ హమని డీఈవో తాహెరా సుల్తానా తెలిపారు. పెడన పాఠశాల విద్యార్థుల ఎగ్జిబిట్ డల్లాస్‌లో మే 23న అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికైందన్నారు.
Updated Date - 2023-02-21T01:29:45+05:30 IST