ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాష్ట్రంలో ప్రతీ తలపై రూ.2 లక్షల అప్పు

ABN, First Publish Date - 2023-09-04T01:03:03+05:30

నాలుగున్నరేళ్లుగా సంక్షేమం పేరుతో ప్రజలన్ని మోసం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రూ.10.80 లక్షల కోట్ల పైనే అప్పులు చేశారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు.

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు

సత్యనారాయణపురం, సెప్టెంబరు 3: నాలుగున్నరేళ్లుగా సంక్షేమం పేరుతో ప్రజలన్ని మోసం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రూ.10.80 లక్షల కోట్ల పైనే అప్పులు చేశారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. సీఎం చేసిన అప్పుల వల్ల ప్రతి మనిషి తలపైన రూ.2 లక్షల అప్పు ఉందన్నారు. 30వ డివిజన్‌ విజయదుర్గానగర్‌ మధ్యకట్ట, దేవినగర్‌ మధురానగర్‌ వంతెన వద్ద ఆదివారం బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. సంక్షేమం పేరుతో నల్లధనాన్ని దాచిన నల్లకుబేరుడు జగన్‌ అని, ఈ డబ్బుతో రాబోయే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఉమా ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి ఎప్పుడు చమరగీతం పాడుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా, ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఇప్పటికే ఇసుక మైనింగ్‌, మద్యం కుంభకోణాలు చేయడమే కాకుండా రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన ఆర్థిక ఉగ్రవాది జగన్‌ అన్నారు. 45 రోజుల పాటు సెంట్రల్‌ నియోజకవర్గంలో బాబుష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్రకార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఘంటా కృష్ణమోహన్‌, గొట్టుముక్కల రఘురామరాజు, సూర్యనారాయణ, శేషంరాజు, లక్కంరాజు, గరిమెళ్ల చిన్నా, శ్రీను, అనురాధ, మురళి, అప్పలనాయుడు, భద్ర, ఫణి, బాజీ, లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-04T01:03:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising