బాధిత కుటుంబానికి రూ.45 లక్షల పరిహారం
ABN, First Publish Date - 2023-07-23T00:37:59+05:30
సిటీ సివిల్ కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ.45 లక్షల పరిహారాన్ని అందించాలని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎం.సత్యానందం ఇన్సూరెన్సు కంపెనీని ఆదేశించారు.
విజయవాడ లీగల్, జూలై 22: సిటీ సివిల్ కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ.45 లక్షల పరిహారాన్ని అందించాలని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎం.సత్యానందం ఇన్సూరెన్సు కంపెనీని ఆదేశించారు. ఈ మేరకు బాధిత కుటుంబానికి అవార్డు కాపీని సత్యానందం అందజేశారు. ఘంటసాల మండలం పాపవినాసం గ్రామానికి చెందిన డొక్కు బల్లియ్యను 2020 సెప్టెంబరు 16న కారు ఢీకొంది. బుల్లియ్య ఓ కార్పొరేట్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్సు కంపెనీ వారిని ప్రతివాదులుగా చేరుస్తూ బాధితుడి తరపు న్యాయవాది నరహరిశెట్టి నర్సింహారావు కేసు దాఖలు చేశారు. అనంతరం పలుదఫాలుగా ఇన్సూరెన్సు కంపెనీ అధికారులతో చర్చలు జరపడంటంతో వారు బాధిత కుటుంబానికి రూ.45 లక్షలు చెల్లించేందుకు అంగీకరించారు. ఈవిషయాన్ని శనివారం న్యాయమూర్తి ముందు వెల్లడించారు. శనివారం 5వ అదనపు జిల్లా జడ్జి ఐ.శైలజా దేవి సమక్షంలో లోక్ అదాలత్ బెంచ్ నిర్వహించారు. మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి చేతుల మీదుగా రూ.45 లక్షల అవార్డు కాపీని బాధిత కుటుంబానికి న్యాయమూర్తి అందచేశారు. బాధిత కుటుంబీకులు మాట్లాడుతూ పలుమార్లు ఇన్సూరెన్సు కంపెనీ వారితో చర్చలు జరిపి తమకు నష్టపరిహారం ఇప్పించిన న్యాయవాది నరహరిశెట్టి నర్సింహారావును అభినందించారు.
మొక్కలు నాటిన ఎంఎ్‌సజే
రోజురోజుకీ పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్, విపరీతమైన కాలుష్యం దృష్ట్యా పర్యావరణ పరిరక్షణకు బెజవాడ బార్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ సంయుక్తంగా విజయవాడ సిటీ సివిల్ కోర్టు ఆవరణలో శనివారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎ.సత్యానందం, ఇతర న్యాయమూర్తులు, బెజవాడ బార్ అధ్యక్ష, కార్యదర్శులు కేబీ సుందర్, జన్ను శ్రీధర్, కార్యవర్గసభ్యులు పుప్పాల శ్రీనివాస్, నరహరిశెట్టి జ్యోతి, ఆకుల పాండురంగ విఠల్, బత్తుల వెంకటేశ్వర్లు, పి.జయలక్ష్మి, పగడాల ఆంజనేయులు, నేరెళ్ల ఆంజనేయులు, బార్ కౌన్సిల్ మెంబర్ చలసాని అజయ్‌కుమార్, న్యాయవాదులు మట్టా జయకర్ పాల్గొన్నారు.
Updated Date - 2023-07-23T00:37:59+05:30 IST