ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త ఈవీఎంలు వస్తున్నాయ్‌

ABN, First Publish Date - 2023-06-03T00:49:04+05:30

జిల్లాలో సాధారణ ఎన్నికల సందడి మొదలైనట్టే కనిపిస్తోంది. కొద్దిరోజుల్లో ఎన్టీఆర్‌ జిల్లాకు కొత్తగా 1,800 ఈవీఎంలు రానున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం జిల్లాలకు నూతన ఈవీఎంలను సరఫరా చేయటం కోసం ఇండెంట్‌ కోరింది. ప్రస్తుతం కలెక్టరేట్‌ గోడౌన్‌లో ఉన్న ఈవీఎంలు 2004 నుంచి ఉపయోగిస్తున్నవే. ఆ తరువాత 2014లో కొత్త ఈవీఎంలు వచ్చాయి. అయితే, 2024లో నిర్వహించే ఎన్నికలకు ఈ ఈవీఎంలను ఉపయోగించకూడదనే కొత్తవి తెప్పించినట్టు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొలిదశలో 1,500, ఆ తర్వాత మరో 300

పక్షం రోజుల్లో కలెక్టరేట్‌ గోడౌన్‌కు..

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో సాధారణ ఎన్నికల సందడి మొదలైనట్టే కనిపిస్తోంది. కొద్దిరోజుల్లో ఎన్టీఆర్‌ జిల్లాకు కొత్తగా 1,800 ఈవీఎంలు రానున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం జిల్లాలకు నూతన ఈవీఎంలను సరఫరా చేయటం కోసం ఇండెంట్‌ కోరింది. ప్రస్తుతం కలెక్టరేట్‌ గోడౌన్‌లో ఉన్న ఈవీఎంలు 2004 నుంచి ఉపయోగిస్తున్నవే. ఆ తరువాత 2014లో కొత్త ఈవీఎంలు వచ్చాయి. అయితే, 2024లో నిర్వహించే ఎన్నికలకు ఈ ఈవీఎంలను ఉపయోగించకూడదనే కొత్తవి తెప్పించినట్టు తెలుస్తోంది.

త్వరలో మరికొన్ని..

ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలో 1,500 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. పెద్ద పోలింగ్‌ కేంద్రాల్లో పది.. ఆపైనే బూత్‌లు ఉంటాయి. కాబట్టి సగటున 10 ఈవీఎంల అవసరం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని 1,500 ఈవీఎంలకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. మరో 300 ఈవీఎంలను కూడా రిజర్వు కోసం ఇండెంట్‌లో పెట్టింది. కలెక్టరేట్‌ గోడౌన్‌లోని స్ర్టాంగ్‌రూమ్‌లో బ్యాలెట్‌ బాక్సులు, ఈవీఎంలు భద్రంగా ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో ఎన్నికల సంఘం అనుమతి మేరకు స్ర్టాంగ్‌రూమ్‌ను తెరిచే అవకాశం ఉంది. స్ర్టాంగ్‌రూమ్‌లను తెరిచిన తర్వాత, వాటిని పరిశీలించాక వాటి స్థితిగతులపై ఎన్నికల సంఘానికి జిల్లా ఎన్నికల యంత్రాంగం నివేదిక పంపుతుంది. ఇక గోడౌన్లను తెరిచే క్రమంలో రాజకీయ పక్షాలకు కూడా సమాచారం ఇవ్వాలని చూస్తున్నారు.

Updated Date - 2023-06-03T00:49:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising