ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదికి పక్కా ఏర్పాట్లు

ABN, First Publish Date - 2023-04-03T00:28:53+05:30

పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి జరగనున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో మొత్తం 30,134 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

పటమట జడ్పీ హైస్కూల్‌లో పది పరీక్షలకు ఏర్పాట్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

30,134 మంది విద్యార్థులు, 1,500 మంది ఇన్విజిలేటర్లు

మధ్యాహ్నం ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి జరగనున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో మొత్తం 30,134 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో రెగ్యులర్‌ విద్యార్థులు 27,329 మంది ఉండగా, ప్రైవేట్‌ విద్యార్థులు 2,805 మంది. మొత్తం 15,530 మంది బాలురు, 14,604 మంది బాలికలు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు జిల్లాలో 154 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో నాలుగు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. జగ్గయ్యపేట, తిరువూరు, జక్కంపూడి, చందర్లపాడులో ఉన్న పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. పరీక్షల్లో విధులు నిర్వర్తించడానికి 1,500 మంది ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా నియమించారు. 154 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్‌ ఆఫీసర్లను నియమించారు. పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయడానికి ఐదు ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. ఇన్విజిలేటర్లుగా సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులకు విధులు కేటాయించారు. వారితోపాటు కొంతమంది స్కూల్‌ అసిస్టెంట్లు ఉన్నారు. సబ్జెక్టు ఉపాధ్యాయులు మాత్రం ఆ సబ్జెక్టు పరీక్ష జరిగే రోజున విధులకు హాజరుకావొద్దని జిల్లా విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వర్తించే అటెండర్ల దగ్గర నుంచి చీఫ్‌ సూపరింటెండెంట్లు, కస్టోడియన్‌ ఆఫీసర్ల వరకు ఎవరూ సెల్‌ఫోన్లు వినియోగించవద్దని ఆదేశాలు ఇచ్చారు. ఉపాధ్యాయులు సెల్‌ఫోన్లు తీసుకొచ్చినా డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌కు అప్పగించాలి. వారు వాటిని ఒక లాకర్‌లో భద్రపరిచి, ఆ తాళాలను బందోబస్తు నిర్వహించే పోలీసులకు అప్పగించాలి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు జరుగు తాయి. ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలకు 15, పదో తరగతి పరీక్షలకు ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3,102 మంది ఇంటర్‌, 1,625 మంది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు జరిగే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

Updated Date - 2023-04-03T00:28:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising