ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుర్రంకొండలో యువకుడు హత్య...?!

ABN, First Publish Date - 2023-03-05T00:03:27+05:30

గుర్రంకొండ మండలం నడిమికండ్రిగ పంచాయతీ చింతమాకులపల్లె సమీపంలో భాస్కర్‌(40) అనే యువకుడిని హత్య చేసి శవాన్ని ప్లాస్టిక్‌ సంచిలో చుట్టి, మెడ కు డ్రిప్‌ వైరుతో రాయిని కట్టి బావిలో పడవేసిన సంఘటన శనివారం వెలుగు చూసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గుర్రంకొండ, మార్చి 4: గుర్రంకొండ మండలం నడిమికండ్రిగ పంచాయతీ చింతమాకులపల్లె సమీపంలో భాస్కర్‌(40) అనే యువకుడిని హత్య చేసి శవాన్ని ప్లాస్టిక్‌ సంచిలో చుట్టి, మెడ కు డ్రిప్‌ వైరుతో రాయిని కట్టి బావిలో పడవేసిన సంఘటన శనివారం వెలుగు చూసింది. కాగా బావిలో యువకుడి మృత దేహం తేలియాడుతోందని చుట్టు పక్కల రైతులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ సంఘటన స్థలాని కి వెళ్లి పరిశీలించి మృతదేహాని వెలికితీశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ యువకుడిని పథకం ప్రకారం హత్య చే సి బావిలో వేసినట్లు ఉందన్నారు. మృతదేహానికి తల పైభాగం నుంచి మోకాళ్ల వరకు ప్లాస్టిక్‌ సంచి తొడిగి మొకాళ్ల వద్ద డ్రిప్‌ వైరుతో కట్టేశారని అలాగే మృతదేహానికి డ్రిప్‌ వైరుతో పెద్ద రాయి కట్టి బావిలో వేసినట్లు తెలిపారు. దీంతో మృతదేహం అటు ఇటు కదలకుండా బావి మధ్యలోనే ఉండిపోయిం దన్నారు. స్థానికుల కథనం మేరకు.. మృతుడు ఎల్‌.భాస్కర్‌కు రామసముద్రం మండలానికి చెందిన అనితతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో వారికి దేవి(4) అనే కుమార్తె ఉంది. అయితే భాస్కర్‌ను భార్య రెండేళ్ల క్రితమే వదిలివేసి రామసముద్రంలో ఉంటోంది. దీంతో భాస్కర్‌ తిరుమల కొం డపై పని చేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రతి నెల 1వ తేదీన వచ్చి వికలాంగ పించన తీసుకొని భాస్కర్‌ తిరుమలకు వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 17న మహాశివ రాత్రికి స్వగ్రామానికి వచ్చి అదే రోజు తల్లి రెడ్డెమ్మకు ఊరిలో ఉన్న స్నేహితులతో మాట్లాడి వస్తానని చెప్పి వెళ్లాడు. దీంతో తల్లి రెడ్డెమ్మ కుమారుడు భాస్కర్‌ తిరుమలకు వెళ్లి ఉం టాడని భావించి పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. ఈ క్రమంలో శనివారం బావిలోని మృతదేహం భాస్కర్‌ దేనని తెలియడంతో బోరుమంది. తమ కుమారుడ్ని ఎవరు హత్య చేసి బావిలో వేశారో...? అని విలపించింది. పోలీసులు మృతదే హాన్ని పోస్టు మార్టం నిమితం వాల్మీకీపురం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. తల్లి రెడ్డెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ తెలిపారు.

హత్య కేసుదర్యాప్తు ముమ్మరం

మదనపల్లె క్రైం, మార్చి 4: మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ వాటర్‌ఫాల్స్‌ సమీపంలోని గుట్టలో గుర్తుతెలి యని ఓ యువకుడు(25)దారుణహత్య కేసు దర్యాప్తును పోలీ సులు ముమ్మరం చేశారు. మృతుడి శరీర భాగాలను ఫోరెన్సిక్‌ సైన్స ల్యాబ్‌కు తరలించినట్లు తాలూకా సీఐ సత్యనారాయణ చెప్పారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ ఎలాంటి ఆధారాలు లభించలే దన్నారు. ఘటనాస్థలం చుట్టుపక్కల ప్రాంతాలను సైతం పరిశీ లించామన్నారు. దీంతో డీఎనఏ టెస్టు నిర్వహణకు చర్యలు తీసుకున్నామన్నారు. డీఎనఏ రిపోర్టు వచ్చిన తరువాత క్షేత్ర స్థాయి దర్యాప్తు చేస్తామన్నారు. ముఖ్యంగా మదనపల్లె డివిజన పరిధిలో నమోదైన అదృశ్యం కేసులపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. మృతుడి వివరాలు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

మదనపల్లె వైస్‌ ఎంపీపీ ఆత్మహత్యాయత్నం

మదనపల్లె క్రైం, మార్చి 4: మదనపల్లె మండల వైస్‌ ఎంపీపీ నందినితాజ్‌(35)శనివారం సూపర్‌ వాస్మోల్‌ తాగి ఆత్మహత్యకు యత్నించారు. మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ బాబుకాలనీకి చెందిన ఈమె వైసీపీ ఎంపీటీసీగా గెలుపొంది వైస్‌ ఎంపీపీగా కొనసాగుతున్నారు. కాగా భర్త కుటుంబ సభ్యు లతో గొడవపడి పట్టణంలో నుంచి ఇంటికెళ్లిన ఈమె వాస్మోల్‌ తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబీకులు బాధితురాలిని ఆటోలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స అందించారు. నందినితాజ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు. ఈ మేరకు విచారిస్తున్నట్లు తాలూకా పోలీసులు చెప్పారు.

శ్రీరంగపట్టణంలో పీలేరు యువకుడి మృతి

ఫ అమ్మమ్మ అస్థికల నిమజ్జనం చేస్తూ నీటమునిగిన వైనం

పీలేరు, మార్చి 4: అమ్మమ్మ అస్థికలు నిమజ్జ నం చేయడానికి వెళ్లి పీలేరుకు చెందిన శ్రీపురం ప్రదీప్‌(33)అనే యువకుడు ప్రమాద వశాత్తు నదిలో మునిగిపోయి మరణించాడు. పీలేరు పట్టణంలోని ప్రముఖ నగల వ్యాపారి శ్రీపురం ప్రకాశ కుమారుడు శ్రీపురం ప్రదీప్‌ తన అమ్మమ్మ అస్థికలు కర్ణాటక రాష్ట్రం మైసూ రు వద్దనున్న శ్రీరంగపట్టణం వద్ద ప్రవహించే కావేరీ నదిలో కలపడానికి శనివారం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అస్థికలు నదిలో కలుపు తున్న సమయంలో ప్రమాదవశాత్తు నదిలో పడి నీటమునిగి చనిపో యాడు. ఈ విషయం శనివారం సాయంత్రం పీలేరులోని వారి బం ధువులకు తెలిసింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రదీప్‌ మరణించిన సంగతి తెలిసి పీలేరు పట్టణం లోని ఆర్యవైశ్య సంఘంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2023-03-05T00:03:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising