వ్యవస్థలను భ్రస్టు పట్టిస్తున్న వైసీపీ
ABN, First Publish Date - 2023-09-22T23:35:07+05:30
వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తోందని టీడీపీ కడప నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆర్.మాధవీరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధనరెడ్డి ఆరోపించారు.
వైఎస్, గంగిరెడ్డి మరణాలపై సీబీఐ విచారణ చేపట్టాలి
టీడీపీ కడప నగర నియోజకవర్గ ఇన్‌చార్జ్ మాధవీరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధనరెడ్డి
కడప (ఎర్రముక్కపల్లె), సెప్టెంబరు 22: వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తోందని టీడీపీ కడప నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆర్.మాధవీరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధనరెడ్డి ఆరోపించారు. కడప నగరం మండీబలజారులో టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ నగర మహిళా అధ్యక్షురాలు సునీత ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలను ప్రారంభించిన మాధవీరెడ్డి మాట్లాడు తూ అధికారం కోసం జగన్‌మోహన్‌రెడ్డి ఏమి చేయడానికైనా వెనుకాడడన్నారు. వైఎస్ జగన్ తీరుపై పలు అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయని విమర్శిం చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎ్‌సఆర్ హెలీక్యాప్టరు దుర్మరణం, ఈసీ గంగిరెడ్డి మృతిపై సీబీ ఐ విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఏ తప్పు చేయని అవినీతికి పాల్పడని టీడీపీ అధినేత చంద్రబాబు కేసును త్వరితగతిన విచారించి బెయిలు మంజూరు చేయాలని కోరారు. బాబు వయస్సు, ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. బాబును విడుదల చేసే వర కూ పోరాటాలు ఆగవని స్పష్టం చేశారు.
రాష్ట్ర కా ర్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధనరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతోందన్నారు. ఏ తప్పూ చేయని చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో పెట్టారంటే వైఎస్ జగన్‌పై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. అధికారం కోసం జగన్ ఏదైనా చేయగల సమర్ధుడన్నారు. వైఎస్ మరణం మొదలు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి మరణం వరకు చర్చ జరగాలని, సీబీఐ విచారణ కూడా జరిపించాలని డిమాండ్ చేశారు. దీక్షల్లో నగర అధ్యక్షురాలు సునీత, ప్రధాన కార్యదర్శి పార్వతి, రామలక్షుమ్మ, కళావతి, లక్ష్మిదేవి, జ్యోతి, అన్నపూర్ణమ్మ, లక్ష్మిదేవి, మునెమ్మ, స్వర్ణలత, నిర్మల మ్మ, కుసుమ, మహాలక్ష్మి, రుక్మిణమ్మ, మంజుల, ఉమాదేవి, శ్రీదేవినాయుడు, ప్రణవతి పాల్గొనార్నరు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి హరిప్రసాద్, నగర అధ్యక్షులు శివకొండారెడ్డి, నేతలు జనార్ధన్, జిలానీబాషా, రాంప్రసాద్, ఎంపీ సురేష్, రవిశంకర్‌రెడ్డి, ఖాజపీర్, బుకారి, రాఘవ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-22T23:35:07+05:30 IST