ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీకి బుద్ధి చెప్పాలి’

ABN, First Publish Date - 2023-04-03T22:54:53+05:30

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పా లని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌ కోరారు.

నిమ్మనపల్లె: ఇదేం ఖర్మ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నిమ్మనపల్లె, ఏప్రిల్‌ 3: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పా లని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌ కోరారు. సోమవారం దిగువపల్లెలో ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్ట భద్రులు సరైన నిర్ణయం తీసుకున్నారన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి పుట్ట గతులు ఉండవన్నారు. వైసీపీ ప్రభుత్వం అప్పు ల్లో కూరుకుపోవడంతో ఉద్యోగులకు నెలసరి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంద న్నారు. దీనికి తోడు సామాన్యులనడ్డి విరిచే విఽ దంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటు తున్నాయన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య నెలకొందని గ్రామస్థులు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయన అధికారులకు ఫోన చేసి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ప్రతి ఇంటికి తిరుగుతూ వైసీపీ అరాచకాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు యశశ్విరాజ్‌, రెడ్డెప్పరెడ్డి, మల్లికా ర్జున, మునిరత్నం, లక్ష్మన్న, వెంకటరమణ, చం ద్ర, విజయ్‌, మురళి, గోపి పాల్గొన్నారు.

‘నియంత’కు గుణపాఠం ఖాయం

ములకలచెరువు: రాష్ట్రంలో అరాచక, నియంత పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రాను న్న ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడం ఖా యమని టీడీపీ మండల అధ్యక్షుడు పాల గిరి సిద్ధా అన్నారు. మండలంలోని సెంట్రల్‌ స్కూల్‌ పంచాయతీ తుమ్మలవారిపల్లెలో సోమ వారం ఇదేంఖర్మ మన రాషా్ట్రనికి కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడు తూ కరెంటు చార్జీలు, నిత్యావసర వసు ్తవుల ధరలు పెంచి వైసీపీ ప్రభుత్వం ప్రజలపై మో యలేని భారాన్ని మోపిందన్నారు. ఈ కార్య క్ర మంలో నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడు చెన్నకిష్టా, రాజంపేట బీసీ సెల్‌ అధికార ప్రతి నిధి ముత్తుకూరు మౌళా, నియోజకవర్గ వాణి జ్య విభాగం అధ్యక్షుడు విజయ్‌కుమార్‌, బీసీ సెల్‌ రాష్ట్ర సాధికార సమితి సభ్యులు జేసీ బీ సుధాకర్‌నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, నేతలు కేశవులు, కేవీ రమణ, సీనియర్‌ నాయకులు మురళీస్వామి, నాయకు లు రామకృష్ణమరాజు, భజంత్రి రా మాంజులు, రవి, ఉమాశంకర్‌, చిన్నరెడ్డెప్ప, అంజిరెడ్డి, కృష్ణ మూర్తి, నాగముణి, జయమ్మ, లక్ష్మీ, కృష్ణవేణి, సిద్దమ్మపాల్గొన్నారు.

పెద్దమండ్యం: ధరల దరువుతో సామాన్య ప్రజలు కష్టాలు పడుతున్నారని పెద్దమండ్యం మండల టీడీపీ కన్వీనర్‌ వెంకట రమణ పేర్కొ న్నారు. మండలంలోని అవికేనాయక్‌ తండాల లో సోమవారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ నటరాజ్‌ నాయక్‌, మండల టీడీపీ నాయకులు మైసూరి శ్రీనివాసులు, గంగాధర, పెద్దన్న, రఘునాధ, రెడ్డిబాష, పవనకుమార్‌, కార్యకర్తలు తదితరు లు పాల్గొన్నారు.

బి.కొత్తకోట : ధరల నియంత్రణలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ బి.కొత్తకోట క్లస్టర్‌ ఇంచార్జ్‌ కనకంటి ప్రసాద్‌ ఆరోపించారు. సోమవారం బి.కొత్తకోట నగర పంచాయతీ పరిధిలోని బీసీ కాలనీలో ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమం నిర్వహించా రు. మండల టీడీపీ కన్వీనర్‌ నారాయణ స్వామిరెడ్డి, మాజీ మండల కన్వీనర్‌ డేరంగుల నారాయణ, టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి మస్తాన, టీడీపీ నాయకులు కుడుం శ్రీనివాసులు, సుకుమార్‌, రాజా, ఆలేటిపల్లె శ్రీనాథ్‌, సురేంద్ర, కుక్కల ప్రసాద్‌, నరసింహులు, దేవుడు నాగరాజు, శతృఘ్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T22:54:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising