ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గండికోట’ నిర్వాసితులకు పరిహారం ఎప్పుడు?

ABN, First Publish Date - 2023-02-06T23:10:38+05:30

గండికోట నిర్వాసి తులకు పునరావాస పరిహారాన్ని పంపిణీ చేయాలని మండల సీపీఐ కార్యదర్శి మనో హర్‌బాబు డిమాండ్‌ చేశారు.

తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న సీపీఐ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండాపురం, ఫిబ్రవరి 6: గండికోట నిర్వాసి తులకు పునరావాస పరిహారాన్ని పంపిణీ చేయాలని మండల సీపీఐ కార్యదర్శి మనో హర్‌బాబు డిమాండ్‌ చేశారు. సోమవారం గండికోట నిర్వాసితుల సమస్యలపై తహసీ ల్దార్‌ శోభన్‌బాబుకు వినతి పత్రాన్ని సమ ర్పించారు. మొదటి విడతలో 14 ముంపు గ్రామాల ప్రజలకు ప్రభుత్వం ఇస్తామన్న రూ.3.25 లక్షలు ఇంత వరకు చెల్లించ లేదన్నారు. కొండాపురంతో పాటు ఆరు గ్రా మాలకు సంబంధించిన సప్లిమెంటరీ జాబితాను విడుదల చేసి పునరా వాస పరిహారాన్ని పంపిణీ చేయాలన్నారు. పెంజి అనంతపురం గ్రామానికి పునరావాసం కల్పించాలన్నారు. రాబోయే బడ్జెట్‌లో ముంపువాసులకు ఉపాధి కల్పించేందుకు నిధులు కేటాయించాలని, లేకపోతే నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం, ఏఐటీయూసీ మండల ప్రధాన కార్యదర్శులు సుదర్శన్‌రెడ్డి, ప్రభాకర్‌రావు, కిషోర్‌, ఖాదర్‌బాషా, దినకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:10:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising