సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలి
ABN, First Publish Date - 2023-03-02T23:37:02+05:30
ప్రభుత్వం అమలు చేస్తున్న సేవలు, సంక్షేమ పథకాలు ప్రజలకు సంతృప్తి స్థాయిలో అందించాలని చీఫ్ సెక్రటరీ డాక్టర్ జవహర్‌రె డ్డి అధికారులను ఆదేశించారు.
ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలి
వీడియో కాన్ఫరెన్సలో చీఫ్ సెక్రటరీ
రాయచోటి (కలెక్టరేట్), మార్చి 2: ప్రభుత్వం అమలు చేస్తున్న సేవలు, సంక్షేమ పథకాలు ప్రజలకు సంతృప్తి స్థాయిలో అందించాలని చీఫ్ సెక్రటరీ డాక్టర్ జవహర్‌రె డ్డి అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడలోని రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స ద్వారా సమీక్షించారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్ మినీ వీడియో కాన్ఫరెన్స హాల్ నుంచి కలెక్టర్ పీఎస్ పీఎస్ గిరీషా, జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా, రాజంపేట సబ్ కలెక్టర్ ఫర్మన అహ్మద్‌ఖాన, డీఆర్‌వో సత్యనారాయణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరగాలన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు సంతృప్తి స్థాయిలో అందాలనే లక్ష్యం మేరకు అధికారులు నిబద్ధత, బాధ్యతతో పనిచేయాలని ఆదేశించారు. సచివాలయ బిల్డింగులు, వైఎ్‌సఆర్ హెల్త్ క్లీనిక్, రైతు భరోసా భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇంకా వివిధ ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై చీఫ్ సెక్రటరీ కలెక్టర్లు, జేసీలు, జిల్లా అధికారులకు దిశ నిర్దేశించారు. అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రీసర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు. అలాగే జల్ జీవన మిషనపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆ పనులను పూర్తి చేయాలన్నారు. ఆర్బీకే, హెల్త్ క్లీనిక్‌లు స్టేజ్ కన్వర్షన మీద ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ లక్ష్యమైతే నిర్ణయించిందో ఆ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలన్నారు.
Updated Date - 2023-03-02T23:37:02+05:30 IST