ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అచ్చెన్న మృతిపై సమగ్ర విచారణ చేస్తాం

ABN, First Publish Date - 2023-03-25T22:57:53+05:30

పశు సంవర్థకశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ చిన్నఅచ్చెన్న మృతిపై ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఆదేశాల మేరకు సమగ్ర విచారణ చేస్తున్నామని డీఎస్పీ శ్రీధర్‌ తెలిపారు.

రామాపురం పోలీ్‌సస్టేషన్‌లో డీఎస్పీ శ్రీధర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

డీఎస్పీ శ్రీధర్‌

రామాపురం, మార్చి 25: పశు సంవర్థకశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ చిన్నఅచ్చెన్న మృతిపై ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఆదేశాల మేరకు సమగ్ర విచారణ చేస్తున్నామని డీఎస్పీ శ్రీధర్‌ తెలిపారు. శనివారం స్థానిక రామాపురం పోలీ్‌సస్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ కర్నూలు-చిత్తూరు 40వ జాతీయ రహదారి గువ్వలచెరువు ఘాట్‌ రోడ్డులోని కోనేటి బండల సమీపంలో శుక్రవారం చిన్న అచ్చెన్న శవమై కనిపించినట్లు ఆ గ్రామ వీఆర్‌వో కల్లూరి ఫాతిమాబీ ఫిర్యాదు మేరకు తమ సిబ్బంది వెళ్లి పరిశీలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని తెలిపారు. సంఘటనా స్థలానికి లక్కిరెడ్డిపల్లె సీఐ వరప్రసాద్‌, రామాపురం ఎస్‌ఐ కొండారెడ్డిలు చేరుకుని డాక్టర్‌ను పిలిపించి పంచనామా జరిపించామన్నారు. అచ్చెన్న మృతదేహాన్ని అతడి కుటుంబీకులకు శుక్రవారం రాత్రి అందజేశామన్నారు. పశు సంవర్థకశాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా చిన్న అచ్చెన్న విధులు నిర్వహిస్తున్న సమయంలో సస్పెండ్‌కు గురైనట్లు సమాచారం ఉందన్నారు. ఆ నోటీసులు తీసుకున్న తర్వాత అతడు మనస్థాపానికి గురయ్యారని సమాచారం ఉందన్నారు. కుటుంబీలకులను ఆ శాఖ అధికారులను సమగ్రంగా విచారిస్తామని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయంపై సమగ్రంగా విచారణ చేస్తామని తెలిపారు.

Updated Date - 2023-03-25T22:57:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising