కోలాహలంగా వినాయక నిమజ్జనం
ABN, First Publish Date - 2023-09-22T23:37:02+05:30
వినాయకచవితిని పురస్కరిం చుకుని మండపాల్లో కొలువుదీ రిన వినాయక విగ్రహాల నిమ జ్జనం శుక్రవారం కోలాహలం గా జరిగింది.
తంబళ్లపల్లె, సెప్టెంబరు 22: వినాయకచవితిని పురస్కరిం చుకుని మండపాల్లో కొలువుదీ రిన వినాయక విగ్రహాల నిమ జ్జనం శుక్రవారం కోలాహలం గా జరిగింది. ఐదు రోజుల పా టు పూజలందుకున్న గణనాథు డు గంగ ఒడికి చేరాడు. తంబ ళ్లపల్లె మండల కేంద్రంలోని పాత కాలేజి గ్రౌండ్, హరిత సర్కిల్, సిద్దా రెడ్డిగారిపల్లె, ఎస్టీ హాస్టల్, నాగేంద్ర వీధి తదితర ప్రదేశాలలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాలను బాణసంచా పేలుళ్లు, కేరళ డ్రమ్స్, సాంస్కృతిక ప్రదర్శనలతో యువత కోలాహలంగా చిన్నేరు ప్రాజెక్టు, మద్ధాతంబావిలలో నిమజ్జనం చేశారు. గణేష్‌యూత ఆధ్వర్యంలో ఏర్పాటు ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూను తంబళ్లపల్లెకు చెందిన వెంకటేష్ శెట్టి వేలం పాటలో రూ.26,516లకు దక్కించుకున్నాడు.
ములకలచెరువులో: ములకలచెరువు పోలీస్‌స్టేషనలో పోలీసులు ఏర్పాటు చేసుకున్న మట్టి వినాయకుడిని శుక్రవారం ఘనంగా నిమ జ్జనం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ గాయత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వినాయకుడి ప్రతిమను ప్రధాన రహదారిలో ఊరేగించి మిట్టసానిపల్లె కాలువలో నిమజ్జనం చేశారు. కార్యక్రమాల్లో ఏఎస్‌ఐ భాస్కర్‌నాయక్, హెడ్ కానిస్టేబుల్ విజయ్‌కుమార్, కానిస్టేబు ళ్ళు మహేంద్రకుమార్. సిరాజ్, హరి, నరసింహులు పాల్గొన్నారు.
పెద్దతిప్పసముద్రంలో: మండలంలోని వివిధ గ్రామాల్లో గణనాథుని నిమజ్జన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పీటీఎంలోని వివిధ గణనాథులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్టర్ల ద్వారా పురవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి యువకులు కేరింతలతో నృత్యాలతో పురవీధుల్లో జైబోలో గణేష్ మారాజ్‌కీ అంటూ వీడ్కోలు పలికారు. పలు మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మండలం లోని రంగసముద్రం, కందుకూరు, పులికల్లు, టి.సదుం, మల్లెల, బూచి పల్లె గ్రామాల్లో గణనాథులకు నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేశారు.
గుర్రంకొండలో:గుర్రంకొండ పట్టణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను శుక్రవారం నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా కొత్తపేట, కాలనీ, వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను ఊరేగించి నిమజ్జనానికి తరలిం చారు. వినాయక విగ్రహాల ఊరేగింపు ముందు కోలాటాలు, చెక్కభ జనలను ఏర్పాటు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులు తగు జాగ్రత్తలను తీసుకొన్నారు.
Updated Date - 2023-09-22T23:37:02+05:30 IST