ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎరువుల దుకాణాలపై విజిలెన్స తనిఖీ

ABN, First Publish Date - 2023-05-31T23:27:24+05:30

జిల్లా కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాల్లో బుధవారం విజిలెన్స అధికారు లు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న విజిలెన్స అండ్‌ ఎనఫోర్స్‌మెంట్‌ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

43 క్వింటాళ్ల విత్తనపు వడ్లు సీజ్‌

రాయచోటిటౌన, మే 31: జిల్లా కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాల్లో బుధవారం విజిలెన్స అధికారు లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విజిలెన్స డీజీ ఆదేశాల మేరకు కడప రీజినల్‌ విజిలెన్స అండ్‌ ఎనఫోర్స్‌మెంట్‌ అధికారి మాసూమ్‌బాషా ఆధ్వర్యంలో విజిలెన్స ఎనఫోర్స్‌మెంట్‌ సీఐ రామకృష్ణ, కేజీ మైన్స శ్రీనివాసులు, ఏఈ అశోక్‌కుమార్‌, స్థానిక వ్యవసాయ అధికారి దివాకర్‌లు రఘు అగ్రిటెక్‌ షాపును, విశ్వప్రసాద్‌ ఫెర్టిలైజర్‌ షాపులను తనిఖీ చేశారు. రికార్డులను స్వాధీనం చేసుకుని... గోడౌనలో ఉన్న సరుకులతో పోల్చి సరిచూశారు. అయితే రఘు అగ్రిటెక్‌ షాపులో స్టాకు వివరాలను సరిగా నమోదు చేయని కారణంగా రూ.1,41,900ల విలువైన 43 క్వింటాళ్ల విత్తనం వడ్ల అమ్మకాలను నిలుపుదల చేస్తూ వ్యవసాయ అధికారి ఉత్తర్వులు ఇచ్చారు. ఎవరైనా దుకాణాదారులు నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తున్నట్లు తెలిసిన వెంటనే విజిలెన్స అధికారుల దృష్టికి తీసుకువస్తే సదరు దుకాణాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

Updated Date - 2023-05-31T23:27:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising