ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

ABN, First Publish Date - 2023-04-03T23:41:05+05:30

వేర్వేరు చోట్ల సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

ఖాజీపేట, ఏప్రిల్‌ 3: వేర్వేరు చోట్ల సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు. సిద్దవటం మండలం జ్యోతి గ్రామానికి ఎందిన గొల్లపల్లె పెద్ద ఓబయ్య (60) తమ మనువళ్లు అయిన అరవింద్‌, అబివర్మలతో కలిసి ద్విచక్ర వాహనంలో స్థానిక అప్పనపల్లెకు బయల్దేరారు. టీడబ్ల్యూడీ బంగ్లా సమీపంలోకి రాగానే కడపవైపు వెళుతున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ఢీకొంది. ఈ దుర్ఘటనలో పెద్ద ఓబయ్య అక్కడికక్కడే మృతిచెందారు. అరవింద్‌, అబివర్మలు తీవ్రంగా గాయపడ్డారు. మనవళ్లను అప్పనపల్లెలోని వసతి గృహంలో చేర్పించేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా కడపకు చెందిన కల్యాణ్‌రెడి ్డ (35) కారులో పని నిమిత్తం ప్రొద్దుటూరుకు వెళ్లారు. తిరిగి కడపకు వెళుతుండగా కడప-కర్నూలు జాతీయ రహదారిలోని ఇంజనీరింగ్‌ కొట్టాలు వద్దకు రాగానే కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ దుర్ఘటనలో కల్యాణ్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. కారు సగభాగం కల్వర్టులోకి దూసుకెళ్లింది. సంఘటన స్థలానికి తహసీల్దారు వెంకటరమణారెడ్డి, ఎస్‌ఐ కుళాయప్పలు చేరుకుని ఎక్స్‌కవేటర్‌ సాయంతో కారులో ఇరుక్కుపోయిన కల్యాణ్‌ను బయటకు తీశారు.

Updated Date - 2023-04-03T23:41:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising