‘వైసీపీ హయాంలో విద్యార్థులకు ఒరిగిందేమీ లేదు’
ABN, First Publish Date - 2023-07-21T23:21:42+05:30
వైసీపీ హయాంలో విద్యార్థులకు ఒరిగిందేమీ లేదని రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ టీఎన్‌ఎస్‌ఎఫ్ అఽ ద్యక్షుడు పోలి శివకుమార్ తెలిపారు.
రైల్వేకోడూరు, జూలై 21: వైసీపీ హయాంలో విద్యార్థులకు ఒరిగిందేమీ లేదని రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ టీఎన్‌ఎస్‌ఎఫ్ అఽ ద్యక్షుడు పోలి శివకుమార్ తెలిపారు. శుక్ర వారం రైల్వేకోడూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ వైసీపీ విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25న విద్యా సంస్థల బంద్‌కు టీఎన్ ఎస్‌ఎఫ్ పిలుపు నిచ్చిందన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు మాత్రమే వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ అనుమతి లేని ప్రైవేటు, కార్పోరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు తక్షణమే విడుదల చేయాలన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూలు పథ కాన్ని పునరుద్ధరించాలన్నారు. సంక్షేమ హాస్టళ్లను ఆధునికీకరించాలన్నారు. టీచర్ పోస్టుల ను తక్షణమే భర్తీ చేయాలన్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థలకు ప్రభుత్వ సాయాన్ని కొనసా గించాలన్నారు. జీవో నెంబరు 77ను రద్దు చేసి, ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్‌మెంట్ కల్పించాలన్నారు. మెగా డీఎస్సీ ని ప్రకటించాలన్నారు. జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియామకాలను తక్షణమే చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో టీఎన్ ఎస్‌ఎఫ్ నాయకులు వల్లెపు శివకుమార్, నియోజకవర్గ నాయకులు గోపాల్‌క్రిష్ణ, రాహుల్, ధన, సాయి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-07-21T23:21:42+05:30 IST