జాయింట్ కలెక్టర్ దృష్టికి పలు సమస్యలు
ABN, First Publish Date - 2023-09-27T23:06:24+05:30
‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి హాజరైన జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్‌ఖాన్‌ను కలిసి ప్రజలు పలు సమస్యలను విన్నవించుకున్నారు.
నందలూరు, సెప్టెంబరు27: ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి హాజరైన జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్‌ఖాన్‌ను కలిసి ప్రజలు పలు సమస్యలను విన్నవించుకున్నారు. సర్పంచ్ జంబు సూర్యనారాయణ నాగిరెడ్డిపల్లె పంచాయితీ నారాయణరాజుపేటలో నేష నల్ హైవేలో ఉన్న దోభీఘాట్, పైపులైన్ పోతున్నాయని, నష్టపరిహారం ఇవ్వాలి లేకపో తే మరో చోట ఏర్పాటు చేయాలని కోరారు. మూసివేసిన ఆల్విన్ పరిశ్రమ స్థానంలో మ రో పరిశ్రమ ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, లేనిపక్షంలో ఎవరి భూములు వారికి ఇవ్వాలని కోరారు. వరదలు వస్తే నీలిపల్లె నీటి మునుగుతోం దని, నాగిరెడ్డిపల్లె పంచాయతీకి నిధులు ఏర్పాటు చేయాలని ఆయన జేసీకి విన్నవించా రు.
కొమ్మూరు, కోనాపురాల్లో 150 కుటుంబాల వారు 280 ఎకరాల డీకేటీ పట్టాలో వరి వేసుకుంటే ఫారెస్ట్ అధికారులు అడ్డు పడుతున్నారని జేసీకి, ఆర్డీఓకు మొరపెట్టుకున్నా రు. దీంతో సానుకూలంగా స్పందించిన జేసీ రికార్డులు పరిశీలించి సమస్యలను పరిష్క రిస్తామని హామీ ఇచ్చారు. అయితే సభ ఆద్యంతం తహసీల్దారు సత్యానందం, ఎంపీడీ ఓ సౌభాగ్యమ్మకు వేదికపై స్థానం కనబరచక పోవడంతో వారు వెనుక భాగంలో నిల్చో వడం పలువిమర్శలుకు తావిచ్చింది. కార్యక్రమంలో రాజంపేట ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి, ఎంపీడీఓ సౌభాగ్యమ్మ, తహశీల్దారు సత్యానందం, జిల్లా అధికారులు, మండల అధికారులు, వైసీపీ నేతలు, ప్రజలు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-27T23:06:24+05:30 IST